టాస్ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న ఆసీస్‌

టాస్ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న ఆసీస్‌
x
Highlights

పెర్త్‌లో భారత్‌, ఆస్ట్రేలియాల మధ్య జరుగుతున్న రెండో టెస్టులో టాస్‌ గెలిచిన ఆస్ట్రేలియా కెప్టెన్‌ టిమ్‌ పెయిన్‌ తొలుత బ్యాటింగ్‌ ఎంచుకున్నాడు. మొదటి...

పెర్త్‌లో భారత్‌, ఆస్ట్రేలియాల మధ్య జరుగుతున్న రెండో టెస్టులో టాస్‌ గెలిచిన ఆస్ట్రేలియా కెప్టెన్‌ టిమ్‌ పెయిన్‌ తొలుత బ్యాటింగ్‌ ఎంచుకున్నాడు. మొదటి టెస్టులో టీమిండియా చేతిలో ఓటమి చవిచూసిన ఆసీస్.. ఎలాగైనా రెండో టెస్టులో గెలవాలని ఉంది.. ఈ టెస్టులో కూడా విజయం సాధించి సిరీస్ చేజిక్కించుకోవాలని టీమిండియా భావిస్తుంది. ఇక భారత్ స్టార్ స్పిన్నర్ అశ్విన్, కీలక ఆటగాడు రోహిత్ శర్మ గాయం కారణంగా రెండో టెస్టుకు దూరమయ్యారు. అశ్విన్‌, రోహిత్‌ శర్మ స్థానంలో హనుమ విహారి, ఉమేశ్‌ యాదవ్‌లకు కోహ్లి స్థానం కల్పించారు. ప్రస్తుతం ఆసీస్ స్కోర్ 9 ఓవర్లలో 34 పరుగులు.

తుది జట్లు
భారత్‌ : కేఎల్‌ రాహుల్‌, విజయ్‌, కోహ్లి(కెప్టెన్‌), పుజారా, రహానె, హనుమ విహారి, రిషబ్‌ పంత్‌, ఇషాంత్‌ శర్మ, మహ్మద్‌ షమి, జస్‌ప్రీత్‌ బుమ్రా, ఉమేశ్‌యాదవ్‌ .

ఆస్ట్రేలియా: ఫించ్‌, హారిస్‌, ఖవాజా, షాన్‌ మార్ష్‌, హ్యాండ్స్‌కాంబ్‌, ట్రావిస్‌ హెడ్‌, టిమ్‌ పెయిన్‌(కెప్టెన్‌), లైయన్‌, హేజిల్‌వుడ్‌, మిచెల్‌ స్టార్క్‌, ప్యాట్‌ కమిన్స్‌ .

Show Full Article
Print Article
Next Story
More Stories