సర్వత్ర టెన్షన్... వాజ్ పేయి ఇంటిముందు బారికేడ్లు ఏర్పాటు...

సర్వత్ర టెన్షన్... వాజ్ పేయి ఇంటిముందు బారికేడ్లు ఏర్పాటు...
x
Highlights

మాజీ ప్రధాని వాజ్‌పేయి ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగానే ఉందని ఢిల్లీ ఎయిమ్స్ ప్రకటించింది. ఆయన ఆరోగ్యం ఏ మాత్రం మెరుగు పడలేదని ఉదయం 11 గంటల తర్వాత...

మాజీ ప్రధాని వాజ్‌పేయి ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగానే ఉందని ఢిల్లీ ఎయిమ్స్ ప్రకటించింది. ఆయన ఆరోగ్యం ఏ మాత్రం మెరుగు పడలేదని ఉదయం 11 గంటల తర్వాత విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో ప్రకటించింది. వాజ్‌పేయికి వెంటిలేటర్‌పైనే చికిత్స కొనసాగుతోందని ఎయిమ్స్ వైద్యులు తెలిపారు. 93 ఏళ్ళ వాజ్‌పేయి ఆరోగ్యం మెరుగుపడడం లేదని తెలిసినప్పటి నుంచి పార్టీ నేతలు, కార్యకర్తలు కలవర పడుతున్నారు. మోడీ సహా కేంద్ర మంత్రులు, బీజేపీ అగ్ర నేతలు ఎయిమ్స్‌కు వరుసగా వస్తుండడంతో వారిలో ఆందోళన మరింత పెరుగుతోంది. గ్వాలియర్ లోని వాజ్ పేయి బంధువులు హుటాహుటిన న్యూఢిల్లీకి బయలుదేరారు. వారిని తరలించేందుకు ప్రత్యేక విమానాన్ని ఏర్పాటు చేసినట్టు వార్తలు వెలువడటంతో, బీజేపీ నేతలు, కార్యకర్తల్లో ఉత్కంఠ నెలకొంది. మరోవైపు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఫరూక్ అబ్దుల్లా కొద్దిసేపటి క్రితం ఆసుపత్రి వద్దకు రాగా, మరికాసేపట్లో ప్రధాని నరేంద్ర మోదీ, మరోసారి ఆసుపత్రికి రానున్నారని అధికారులు వెల్లడించారు. ఆసుపత్రి వద్ద బారికేడ్లను ఏర్పాటు చేసిన సెక్యూరిటీ సిబ్బంది, ఆ ప్రాంతంలో వాహనాల రాకపోకలపైనా ఆంక్షలు విధించారు. మరోవైపు వాజ్ పేయి ఇంటి ముందు కూడా భారీ ఎత్తన భద్రతను ఏర్పాటు చేసి, రహదారులపై బారికేడ్లను ఏర్పాటు చేసి, రహదారిని బ్లాక్ చేయడంతో సర్వత్ర టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories