మరోలోక నాయకుడయ్యవా కర్మయోగి?

Submitted by arun on Fri, 08/17/2018 - 12:58
atal

బారత్ ముద్దు బిడ్డ 93 ఏళ్ల వాజ్‌పేయ సారూ,

నిన్న సాయంత్రం 5.05  తుదిశ్వాస విడిచారు,

బీజేపీ హెడ్ ఆఫీస్‌ నుండి అంతిమయాత్ర, షురు,

సాయంత్రం 5 గంటలకు అంత్యక్రియలని తెలిపారు,

మరో లోక నాయకుడిగా అయినట్టునాడు వాజపాయ్ గారు. శ్రీ.కో. 

గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న 93 ఏళ్ల వాజ్‌పేయ... ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చికిత్స పొందుతూ నిన్న సాయంత్రం 5.05 గంటలకు తుదిశ్వాస విడిచారు. వాజ్‌పేయి మృతికి రాజకీయ, సినీ, వ్యాపార, క్రీడా ప్రముఖులు సంతాపం తెలియజేశారు. కాగా, ఇవాళ సాయంత్రం 5 గంటలకు వాజ్‌పేయి భౌతికకాయానికి అంత్యక్రియలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. అటల్ భౌతికకాయాన్ని ఉదయం 9 గంటల వరకు న్యూఢిల్లీలోని కృష్ణమీనన్ మార్గంలో ఉన్న ఆయన నివాసంలో ఉంచి.... అనంతరం బీజేపీ కేంద్ర కార్యాలయానికి తరలిస్తారు. మధ్యాహ్నం 1.30 గంటల వరకు ప్రజల సందర్శనార్థం అక్కడే ఉంచుతారు. ఆ తర్వాత బీజేపీ హెడ్ ఆఫీస్‌ నుంచి వాజ్‌పేయి అంతిమయాత్ర ప్రారంభమవుతుంది. సాయంత్రం 5 గంటలకు రాష్ట్రీయ స్మృతి స్థల్‌లో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఢిల్లీలోని యమునా నది ఒడ్డున వాజ్‌పేయి అంత్యక్రియలు నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.

English Title
atal bihari vajpayee passed away

MORE FROM AUTHOR

RELATED ARTICLES