ఎయిమ్స్‌లో చేరిన మాజీ పీఎం వాజ్‌పేయి

Submitted by arun on Mon, 06/11/2018 - 14:28
atal

మాజీ ప్రధాని అటల్ బీహారీ వాజ్‌పేయి ఇవాళ ఉదయం ఢిల్లీ ఎయిమ్స్‌లో చేరారు. గత కొంతకాలంగా వాజ్‌పేయి అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలిసిందే. సాధారణ వైద్య పరీక్షల నిమిత్తం ఎయిమ్స్‌కు వాజ్‌పేయిని తరలించినట్లు బీజేపీ ప్రకటించింది. ఎయిమ్స్‌ సంచాలకులు రణ్‌దీప్‌ గులేరియా ఆధ్వర్యంలో ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. మూడు దశాబ్దాలుగా వాజ్‌పేయికు వ్యక్తిగత ఫిజీషియన్‌గా ఉంటున్నారు. అనారోగ్యం కారణంగా కొంతకాలం నుంచి ఇంటికే పరిమితమయ్యారు వాజ్‌పేయి. బీజేపీ చెందిన ఎటువంటి కార్యక్రమాలకు హాజరుకావడం లేదు.

English Title
Atal Bihari Vajpayee Admitted To Delhi's AIIMS For Routine Check-Up, Says BJP

MORE FROM AUTHOR

RELATED ARTICLES