డిసెంబర్‌ 26,29 తేదీల మధ్య తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు..

డిసెంబర్‌ 26,29 తేదీల మధ్య తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు..
x
Highlights

ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు సెప్టెంబర్‌ 10వ తేదీలోగా తెలంగాణ శాసనసభ రద్దుకు సిఫారసు చేసిన పక్షంలో డిసెంబర్‌లో ఛత్తీస్‌గఢ్, రాజస్తాన్, మధ్యప్రదేశ్,...

ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు సెప్టెంబర్‌ 10వ తేదీలోగా తెలంగాణ శాసనసభ రద్దుకు సిఫారసు చేసిన పక్షంలో డిసెంబర్‌లో ఛత్తీస్‌గఢ్, రాజస్తాన్, మధ్యప్రదేశ్, మిజోరంతో పాటే తెలంగాణలో కూడా ఎన్నికలు జరుగనున్నాయి. ఈ మేరకు కేంద్ర ఎన్నికల కమిషన్‌ ఏర్పాట్లు సాధ్య సాధ్యాలపై దృష్టి సారించింది. ఫైనల్ గా తెలంగాణలో ముందస్తు ఎన్నికలు జరపాలని ఈసీ భావిస్తోంది. దీంతో ఆ నాలుగు రాష్ట్రాలతో పాటే తెలంగాణ శాసనసభ ఎన్నికలకు నవంబర్‌ రెండో వారంలో ఎన్నికల షెడ్యూల్‌ కూడా వెలువడనుంది. అన్నీ కుదిరితే డిసెంబర్‌ 26,29 తేదీల మధ్యన తెలంగాణ శాసనసభకు ఎన్నికలు జరగనున్నాయి. డిసెంబర్‌ 31వ తేదీలోగా మొత్తం ఐదు రాష్ట్రాల ఎన్నికల ప్రక్రియను పూర్తి చేసి ఆ వెంటనే లోక్‌సభ ఎన్నికల ప్రక్రియకు శ్రీకారం చుట్టాలని ఈసీ భావిస్తున్నట్టు తెలుస్తోంది. గతంలో జమిలి ఎన్నికల ప్రస్తావన వచ్చినప్పుడు లోక్ సభ తో పాటు నాలుగైదు రాష్ట్రాలకు ఎన్నికలు నిర్వచించాడనికి సిద్దమన్న సంకేతాలు ఇచ్చింది ఈసీ. ఈ క్రమంలో డిసెంబర్ లో జరగాల్సిన నాలుగు రాష్ట్రాల ఎన్నికలతో పాటు చిన్న రాష్ట్రమైన తెలంగాణకు ఎన్నికలు జరపడం పెద్ద కష్టమేమి కాదని ఈసీ నమ్ముతోంది. దాంతో ఇప్పటికైతే తెలంగాణలో ముందస్తు ఎన్నికలకు ఈసీ రెడీగా ఉంది. ఇక తేల్చాల్సింది కేంద్ర ప్రభుత్వం, తేల్చుకోవలసింది పార్టీలు.

Show Full Article
Print Article
Next Story
More Stories