కన్నకూతురిపై అత్యాచారం..కోర్టులోనే భార్య హత్య

Submitted by arun on Sat, 06/16/2018 - 15:50
murder

కన్నకూతురిపై అత్యాచారానికి ఒడిగట్టిన ఓ మానవమృగం... తన భార్యను కోర్టు రూమ్‌లోనే దారుణంగా హతమార్చాడు. అస్సాంలోని దిబ్రుగఢ్ జిల్లా సెషన్స్ కోర్టు ఆవరణలో ఈ షాకింగ్ సంఘటన చోటుచేసుకుంది. డిబ్రూగఢ్ డీఎస్‌పీ  ప్రదీప్‌ సైకియా అందించిన సమాచారం  ప్రకారం నిందితుడు పూర్ణ నహర్‌ డేకా  కుమార్తెపై అత్యాచారానికి పాల్పడిన కేసులో ఇటీవల బెయిల్‌ పై విడుదలయ్యాడు.  ఈ కేసులో ఫిర్యాదుదారుగా అతని భార్య   రీటా నహర్ దేకా కోర్టు హాజరైంది. అకస్మాత్తుగా  నిందితుడు భార్యపై దాడిచేశాడు. జేబులో నుంచి కత్తితీసి  గొంతు కోశాడు.  వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించినప్పటికీ అప్పటికే ఆమె మరణించినట్లు  వైద్యులు ప్రకటించారన్నారు.  ఈయ కేసులో నిందితుడు  తొమ్మిది నెలలపాటు  జైలులో ఉన్నాడనీ, కొన్ని రోజుల క్రితం  బెయిల్‌పై  విడుదలయ్యాడరి డిబ్రూగఢ్ పోలీస్ స్టేషన్ ఆఫీసర్ ఇన్ ఛార్జ్ సిధేశ్వర్ బోరాహ్  చెప్పారు.

English Title
Assam Man, Accused Of Raping His Daughter, Kills Wife In Court Premises

MORE FROM AUTHOR

RELATED ARTICLES