logo

కేసీఆర్‌ను కలవడానికి బైక్‌పై వచ్చిన అసదుద్దీన్

టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌తో మజ్లీస్‌ అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ భేటీ అయ్యారు. ప్రగతీ భవన్‌లో సమావేశానికి ఒవైసీ బుల్లెట్‌పై వెళ్లారు. ఒక్కసారిగా జరిగిన ఈ అనూహ్య పరిణామానికి అంతా అవాక్కయ్యారు. కెమెరా కంటికి చిక్కకుండా ప్రగతి భవన్‌కు ఒవైసీ చేరుకున్నారు. వీరిద్దరి మధ్య కీలక చర్చలు జరుగుతున్నాయి. కాసేపటి క్రితమే కాబోయే సీఎం కేసీఆర్‌తో సమావేశం అవుతున్నట్లు ఒవైసీ ట్వీట్‌ చేశారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మంగళవారం వెలువడనున్న నేపథ్యంలో కేసీఆర్‌తో అసద్ భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది. హంగ్ వచ్చే అవకాశం ఉందని పలు సర్వేలు చెప్పడంతో టీఆర్ఎస్‌కు మద్దతు ఇచ్చే విషయంలో ఆ పార్టీ అధినేత కేసీఆర్‌తో అసదుద్దీన్ భేటీ అయినట్లు తెలుస్తోంది.

లైవ్ టీవి

Share it
Top