ప్రేమజంటపై జవాన్ దాడి...అత్యాచారయత్నం

Submitted by arun on Wed, 07/25/2018 - 16:32
Attack

హైదరాబాద్‌లో ఓ జవాను ప్రేమ జంటపై దాడి చేశాడు. అంతేకాదు యువతిపై అత్యాచార యత్నం చేశాడు. హైదరాబాద్ అమ్ముగూడ రైల్వే ష్టేషన్ దగ్గర మొన్న సాయంత్రం జరిగిన ఈ దారుణం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇంటర్ చదువుతున్న ఓ ప్రేమ జంట అమ్ముగూడ రైల్వే ష్టేషన్ దగ్గర మాట్లాడుకుంటున్న సమయంలో అక్కడికి వచ్చిన జవాన్ ఆ యువకుడిపై దాడి చేశాడు. దీంతో అతను పారిపోగా యువతిపై అత్యాచార యత్నం చేశాడు. వెంటనే ఆమె పోలీసులకు ఫోన్ చేసింది. ఇంతలో అక్కడే గస్తీ తిరుగుతున్న కానిస్టేబుల్ బాధితురాలి అరుపులు విని అక్కడికి వచ్చాడు. జవానుని పట్టుకోబోగా అతను కానిస్టేబుల్ పై దాడి చేసి పారిపోయే యత్నంచేశాడు. మరో కానిస్టేబుల్ ఛేజ్ చేసి నిందితుణ్ణి పట్టుకున్నాడు.

ప్రేమజంటపై దాడి చేసి అత్యాచార యత్నం చేసిన జవానుని పట్టుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించి విచారించగా తన పేరు బ్రిజేష్ అని చెప్పాడు. మరోవైపు బాధిత ప్రేమ జంట జరిగిన ఘటనపై తిరుమల గిరి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. బ్రిజేష్‌పై కేసు నమోదు చేసిన ఫోలీసులు అతన్ని రిమాండ్‌కు తరలించారు. బ్రిజేష్ గతంలో కూడా ఇంలాంటి అఘాయిత్యాలకు పాల్పడినట్లు తెలుస్తోంది. 
 

English Title
army jawan attack on lovers

MORE FROM AUTHOR

RELATED ARTICLES