‘అరవింద సమేత’ స్టిల్‌ లీక్‌.. వైరల్‌

Submitted by arun on Mon, 07/23/2018 - 11:43
Aravinda Sametha

యంగ్ టైగర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ క్రేజీ కాంబినేషన్ లో వస్తున్న అరవింద సమేత చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ చిత్రానికి సంబందించిన ఏ విషయం అయినా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. చిత్రంపై నెలకొన్న భారీ అంచనాలకు ఇదే నిదర్శనం. తాజగా ఈ చిత్రం నుంచి లీకైన స్టిల్ ఒక సోషల్ మీడియాలో భిభత్సం సృష్టిస్తోంది. ఈ ఫొటోలో ఎన్టీఆర్‌ సీరియస్‌గా ఉండగా.. ఆయన తండ్రిగా నటిస్తున్న నాగబాబు ఎదో ప్రమాదంలో ఉన్నట్లు కనిపిస్తోంది. ఈ ఫొటోను బట్టి ఈ సినిమాలో ఎంతో ఎమోషన్‌ ఉండబోతుందనేది అర్థమవుతోంది. హారిక హాసిని క్రియేషన్స్‌ పతాకంపై రాధాకృష్ణ నిర్మిస్తున్నఈ చిత్రంలో పూజా హెగ్డే కథానాయికగా.. జగపతిబాబు, నాగబాబులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఆగస్ట్‌ 15న ‘అరవింద సమేత..’ టీజర్‌ను విడుదల చేయాలని చిత్రబృందం భావిస్తోంది. తమన్‌ సంగీతం సమకూరుస్తున్న ఈ చిత్రాన్ని అక్టోబర్‌ 10న రిలీజ్‌ చేయాలని ప్లాన్‌ చేస్తున్నారు.

Image removed.

English Title
aravinda sametha photo leaked

MORE FROM AUTHOR

RELATED ARTICLES