రూటు మార్చిన ఆర్టీసీ...రవాణా శాఖ మంత్రి జిల్లాలో...

రూటు మార్చిన ఆర్టీసీ...రవాణా శాఖ మంత్రి జిల్లాలో...
x
Highlights

ప్రయాణికుల సంక్షేమమే లక్ష్యం అని చెప్పుకునే ఆర్టీసీ నినాదం మారుతోంది ఆదాయ మార్గం ఉన్న రహదారుల్లోనే వెతుక్కుంటుంది లాభం ఉంటే తప్పా బస్సులు నడిపేందుకు...

ప్రయాణికుల సంక్షేమమే లక్ష్యం అని చెప్పుకునే ఆర్టీసీ నినాదం మారుతోంది ఆదాయ మార్గం ఉన్న రహదారుల్లోనే వెతుక్కుంటుంది లాభం ఉంటే తప్పా బస్సులు నడిపేందుకు అధికారులు ససేమిరా అంటున్నారు. స్వయనా తెలంగాణ రాష్ర్ట రవాణా మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లాల్లోనూ బస్సు ఎరగని పల్లెలు ఎన్నో ఉన్నాయి. ప్రైవేట్ వాహనాలే దిక్కవుతున్నాయి నిజామాబాద్ జిల్లాలో బస్సు రాని పల్లెలపై ప్రత్యేక కథనం.

రోడ్డు సౌకర్యం ఉన్న ప్రతీ గ్రామానికి బస్సు నడుపుతామన్న ఆర్టీసీ ఇప్పుడు తమ రూటు మార్చింది. కేవలం లాభాలు వచ్చే రూట్లలో మాత్రమే బస్సులు నడుపుతూ పల్లె జనాలకు రవాణా సౌకర్యం దూరం చేస్తున్నారు. తెలంగాణ రాష్ర్ట రవాణా శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న నిజామాబాద్ జిల్లాలోనే బస్సు ఎరుగని పల్లెలు వందల సంఖ్యలో ఉన్నాయి కొన్ని గ్రామాల్లో దశాబ్దాలుగా ప్రగతి చక్రాలు పల్లెల ముఖం చూడటం లేదు.

నిజామాబాద్ జిల్లాలో సుమారు 1629 పల్లెలు ఉన్నాయి. వీటిలో 1286 గ్రామాలకు మాత్రమే బస్సు సౌకర్యం కల్పించారు. 343 గ్రామాల ప్రజలు పల్లె వెలుగు బస్సులను చూడటం లేదు. రహదారులు లేని గ్రామాల విషయాన్ని పక్కన బెడితే మెరుగైన తారురోడ్లు ఉన్న మార్గాల్లోనూ ఆర్టీసీ బస్సులు నడపడం లేదు. ప్రైవేట్ వాహనాలు ఆటోలే దిక్కవుతున్నాయి.

నిజామాబాద్ జిల్లా కేంద్రానికి కూతవేటు దూరంలో ఉన్న డీకంపల్లి గ్రామంతో పాటు మంత్రి ప్రశాంత్ రెడ్డి సొంత మండలం వేల్పూరులోనూ ఐదు గ్రామాలకు బస్సు సౌకర్యం లేదు. అత్యవసర పరిస్ధితుల్లో ఇతర ప్రాంతాలకువెళ్లే వారు నరకయాతన పడుతున్నారు. ప్రైవేట్ వాహనాల్లో ప్రమాదం అని తెలిసినా ప్రత్యామ్నయం లేక ప్రమాదపుటంచున ప్రయాణాలు కొనసాగిస్తున్నారు. ఇక బస్సు సౌకర్యం కలిగి ఉన్న జుక్కల్, ఎల్లారెడ్డి, ఆర్మూర్, బాల్కొండ నియోజకవర్గాల్లో మెజార్టీ గ్రామ పంచాయతీలకు ఆదాయం లేదనే సాకుతో బస్సులు రద్దు చేశారు.

పల్లె బస్సు ఎరగని గ్రామాలు అధికారికంగా 342 ఉన్నా అధికారులు మాత్రం కేవలం 74 గ్రామాలకు మాత్రమే బస్సులు నడపడం లేదని చెబుతున్నారు. 2 నుంచి 4 కిలోమీటర్ల దూరంలో బస్సు వెళ్లినా ఆ గ్రామాలకు బస్సులు వెళుతున్నట్లు రికార్డులు సృష్టించారు. రోడ్డు సౌకర్యం ఉంటే బస్సులు నడిపేందుకు ప్రయత్నిస్తామని ఆర్టీసీ ఆర్ఎం. పాత మాటే పాడుతున్నారు. ఆర్టీసీ అధికారులు ఇప్పటికైనా స్పందించి బస్సు ఎరగని గ్రామాలకు బస్సు సౌకర్యం కల్పించాలని ప్రయాణికులు కోరుతున్నారు. రవాణా శాఖ మంత్రి జిల్లాలో ఈ దుస్ధితి ఉంటే మిగతా జిల్లాల పరిస్ధితి ఎలా ఉందో అర్దం చేసుకోవచ్చు.

Show Full Article
Print Article
Next Story
More Stories