ఏపీ రాష్ట్ర చిహ్నాలు ఖరారు

Submitted by arun on Thu, 05/31/2018 - 11:26
 AP State Symbols

రాష్ట్ర చిహ్నాలను ఖరారు చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఆంధ్రప్రదేశ్ కంటూ ప్రత్యేక చిహ్నాలు లేకపోవటంతో  వాటిని ఖరారు చేస్తూ అటవీ శాఖ ముఖ్య కార్యదర్శి అనంతరాము జీవోను విడుదల చేశారు. 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చిహ్నాలను ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ప్రత్యేక చిహ్నాలు నిర్ణయించినా, ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న చిహ్నాలే ఉన్నాయి. దీంతో కొత్తగా రాష్ట్ర చిహ్నాలను ప్రకటించింది ఏపీ సర్కార్. 

ఉమ్మడి రాష్ట్రంలో రాష్ట్ర పక్షిగా పాలపిట్ట ఉండగా, దాని స్థానంలో ప్రస్తుతం రామచిలుకను గుర్తించారు. అలాగే, రాష్ట్ర వృక్షంగా వేప చెట్టు, రాష్ట్ర జంతువుగా కృష్ణ జింక, రాష్ట్ర పక్షిగా రామచిలుక, రాష్ట్ర పుష్పంగా మల్లె పువ్వును గుర్తిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేపింది. అయితే, ప్రభుత్వం తాజా ప్రకటించిన ఈ చిహ్నాలు జూన్ 6 నుంచి అధికారికంగా అమల్లోకి రానున్నాయి. 

English Title
AP names new state symbols

MORE FROM AUTHOR

RELATED ARTICLES