రాజీవ్‌ గాంధీకి ఘన నివాళి..

రాజీవ్‌ గాంధీకి ఘన నివాళి..
x
Highlights

నేడు మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్థంతి సందర్భంగా కాంగ్రెస్‌ నేతలు ఘన నివాళులు అర్పించారు. దేశ రాజధాని ఢీల్లీలోని రాజీవ్‌ సమాధి వీర్ భూమి వద్ద...

నేడు మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్థంతి సందర్భంగా కాంగ్రెస్‌ నేతలు ఘన నివాళులు అర్పించారు. దేశ రాజధాని ఢీల్లీలోని రాజీవ్‌ సమాధి వీర్ భూమి వద్ద సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక వాద్రా ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ సహా పలువురు కాంగ్రెస్ సీనియర్లు సమాధి వద్ద నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా రాజీవ్ గాంధీ దేశానికి చేసిన సేవలను గుర్తుచేశారు. దేశ వ్యాప్తంగా గల కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయాల్లో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్థంతిని నిర్వహించారు. కాగా ఎన్నికల ప్రచారంలో భాగంగా తమిళనాడు వెళ్లిన రాజీవ్ గాంధీ 1991 మే 21 వ తేదిన హత్యకు గురైన విషయం తెలిసిందే.

Show Full Article
Print Article
Next Story
More Stories