ఏపీకి మరో వాయు గండం

x
Highlights

టిట్లీ తుఫాను బీభత్సాన్ని మరువక ముందే ఏపీకి మరో వాయుగుండం పొంచుకు వస్తోంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయు గుండంగా మారి పెథాయ్ తుఫానుగా...

టిట్లీ తుఫాను బీభత్సాన్ని మరువక ముందే ఏపీకి మరో వాయుగుండం పొంచుకు వస్తోంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయు గుండంగా మారి పెథాయ్ తుఫానుగా దూసుకొస్తోంది. దీంతో రాబోయే 48 గంటల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నట్టు భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ముందస్తు హెచ్చరికలతో అప్రమత్తమైన ఏపీ ప్రభుత్వం తీర పాంత్ర అధికారులను అలర్ట్ చేసింది.

ఆగ్నేయ బంగాళా ఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారి తీవ్ర వాయుగుండంగానికి చేరుకుంది. గంటకు 11 కిలోమీటర్ల వేగంతో వాయవ్య దిశగా పయనిస్తోంది. గురువారం అర్ధ రాత్రి మచిలీపట్నానికి దక్షిణ ఆగ్నేయంగా 1100, చెన్నైకి దక్షిణ ఆగ్నేయంగా 950 కి.మీ. దూరంలో కేంద్రీకృతమై ఉంది. తుపానుగా మారాక వాయవ్య దిశగా కోస్తాంధ్ర వైపు వస్తోందని భారత వాతావరణ విభాగం వెల్లడించింది. ఈ తుఫానుగా ఫెథాయ్‌గా నామకరణం చేసిన వాతావరణ శాఖ పరిస్థితిని ఎప్పటికప్పుడు అంచనా వేస్తోంది. దీని ప్రభావంతో చెన్నైతో పాటు చిత్తూరు నుంచి శ్రీకాకుళం వరకు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశామున్నట్టు వెల్లడించింది.

ప్రస్తుతం తుపానుగా ఉన్న పెథాయ్ మరో 24 గంటల్లో తీవ్ర తుఫానుగా విరుచుకుపడే అవకాశాలున్నట్టు వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ సమయంలో 90 నుంచి 120 కిలోమీటర్ల వేగంతో తీరం వెంబడి బలమైన గాలులు వీస్తాయని వివరించింది. ముఖ్యంగా మచిలీపట్నం నుంచి విశాఖ వరకు పెను ప్రమాదం పొంచి ఉన్నట్టు వెల్లడించింది. ఈనేపథ్యంలో విశాఖపట్నం, మచిలీపట్నం, నిజాంపట్నం, కృష్ణపట్నం, కాకినాడ, గంగవరం పోర్టుల్లో ఒకటో నంబరు ప్రమాద సూచికను ఎగురవేశారు.

వాయుగుండం ప్రభావంతో సముద్రం అల్లకల్లోలంగా మారనుందని, అలల తీవ్రత పెరిగే అవకాశం ఉందని తెలిపింది. మత్స్యకారులెవరూ చేపల వేటకు వెళ్లవద్దని అధికారులు సూచించారు. వాతావరణ శాఖ హెచ్చరికలతో ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. తీరప్రాంత జిల్లాల కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలంటూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదేశించారు. ఇందుకోసం రియల్‌టైం గవర్నెన్స్‌ ద్వారా ఎప్పటికప్పుడు పరిస్థితులను ఉన్నతాధికారులు సమీక్షిస్తున్నారు.

వాయుగుండం హెచ్చరికతో కృష్ణా జిల్లాలో ప్రత్యేక కంట్రోల్ రూంలను ఏర్పాటు చేశారు. మచిలీపట్నం, గుడివాడ, నూజివీడు, విజయవాడల్లో ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేసి పరిస్ధితులను సమీక్షిస్తున్నారు .మరో వైపు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్ అధికారులతో ప్రత్యేకంగా సమీక్ష నిర్వహించారు. గాలుల తీవ్రత అధికంగా ఉన్నందున అధికారులు ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడే అవకాశాలున్నందున అప్రమత్తంగా ఉండాలంటూ సూచించారు. తాగునీటి వసతితో పాటు పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories