చేయి జారుతుంది...చంద్రబాబును కలిసిన...
కేంద్రంలో అధికారంలోకొస్తే ప్రత్యేక హోదా ఇస్తామంటున్న కాంగ్రెస్ ఏపీలో ఎలాంటి పరిస్థితిలో ఉంది..? పునర్ వైభవం కోసం పాకులాడుతున్న ఆ పార్టీ అందుకు అనుగుణంగా వ్యూహాలు రచిస్తోందా..? ఎన్నికల నాటికి రేసులో ఉండాలనుకున్న హస్తం పార్టీ ప్రధాన పార్టీలకు కనీసం పోటీ అయినా ఇస్తుందా..? త్వరలోనే భారీగా వలసలు ఉంటాయంటున్న ఆ పార్టీ నుంచి జారిపోతున్నవారిని నిలువరిస్తుందా..?
2014 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో అడ్రస్ లేకుండా గల్లంతైన కాంగ్రెస్ మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ప్రజల ముంగిట్లోకి వెళ్తోంది. అందుకు అనుగుణంగా హైకమాండ్ నుంచి మంచి సపోర్ట్ కూడా బాగానే ఉంది. ఏపీ కాంగ్రెస్ ఇంచార్జీ ఉమెన్ చాందీ నేతలు, క్యాడర్‌ను ఉరుకులు పరుగులు పెట్టిస్తున్నారు. వచ్చే 5 నెలలు ప్రజల్లోనే ఉండాలని కార్యాచరణ కూడా రూపొందించారు. బూత్ లెవెల్ నుంచి నియోజకవర్గ స్థాయిలో కమిటీల నిర్మాణం చేపడుతున్నారు.
పైకి బలోపేతం చేయాలని ఉవ్వీళ్లూరుతున్నా క్షేత్ర స్థాయిలో అందుకు అనుగుణంగా పార్టీ శ్రేణుల పనితీరు ఆశించిన స్థాయిలో లేదని చెబుతున్నారు. ముఖ్యంగా నాయకుల్లో ఆర్థికపరమైన ఇబ్బందులు వెంటాడుతున్నాయి. సొంతంగా ఖర్చులు పెట్టుకోవడం తమవల్ల కాదని చేతులెత్తేస్తున్నారు. ఒకవేళ ధైర్యం చేసి ఖర్చు పెట్టుకున్నా ఎన్నికల్లో గట్టెక్కుతామనే ఆశ ఏమాత్రం లేదని బహిరంగంగానే చెబుతున్నారు.
ఇటీవలే మాజీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి లాంటి వారు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఇలాగే భారీగా వలసలుంటాయని చెబుతున్నా ఇప్పటికిప్పుడు పార్టీలోకి వచ్చే వారెవరూ కనుచూపుమేర లేరని టాక్ వినిపిస్తోంది. అసలు చేరికల మాట అటుంచితే ఉన్న కొద్దిమంది నేతలు జారిపోయేలా కనిపిస్తున్నారు. మాజీ మంత్రి కొండ్రు మురళి కాంగ్రెస్ సమన్వయ కమిటీ సమావేశానికి హాజరైన తర్వాత టీడీపీ నేతలతో టచ్ లో ఉంటూ వస్తున్నారు. దీంతో ఆయన దాదాపు సైకిల్ ఎక్కడం ఖాయం అని తెలుస్తోంది.
అలాగే మరో నేత ఉగ్ర నరసింహా రెడ్డి కూడా సీఎం చంద్రబాబు ను కలవడంతో ఆయన కూడా టీడీపీ తీర్థం పుచ్చుకునే వారి జాబితాలోకి చేరిపోయారు. మాజీ మంత్రి శైలజానాథ్ పరిస్థితి కూడా అటా ఇటా అన్నట్లుగా ఉంది. బీ ఫామ్ గ్యారెంటీ అయితే సైకిల్‌పై సవారీ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. వీరంతా పైకి వేరే కారణాలు చెపుతున్నా తమ డిమాండ్లపై స్పష్టత వస్తే పసుపు కండువా వేసుకోవడం ఖాయం అనే చర్చ నడుస్తోంది.
పార్టీ బలోపేతం కోసం కాంగ్రెస్ పెద్దలు నానా తంటాలు పడుతుంటే ఉన్న కొద్ది మంది లీడర్లు పక్కచూపులు చూస్తున్నారు. ఎన్నికలు దగ్గరపడుతుండటంతో పక్కదారి పట్టేవారిని ఎలా నిలువరించాలో తెలియక హస్తం నాయకుల్లో ఆందోళన మొదలైంది.
లైవ్ టీవి
దేవ్...వావ్ అయితే కాదు...
15 Feb 2019 11:03 AM GMTయాత్ర డైలాగ్స్ జీవిత సత్యాలు..ముత్యాలుగా నిలిచాయి
14 Feb 2019 7:27 AM GMTచలాకి హీరొయిన్ రాధిక గారు!
12 Feb 2019 6:36 AM GMTవిజయవంతమైన ఎన్నో చిత్రాలు అందించిన విజయ బాపినీడు గారు!
12 Feb 2019 6:10 AM GMTసూత్రధారులు సిన్మాకి సూత్రధారులు
10 Feb 2019 10:05 AM GMT