కీలక నిర్ణయాలు తీసుకున్న ఏపీ కేబినెట్‌

Submitted by arun on Wed, 06/20/2018 - 07:01
babu

ఆంధ్రప్రదేశ్‌ మంత్రివర్గం కీలక నిర్ణయాలు తీసుకుంది. ముఖ్యంగా వివిధ సామాజిక వర్గాల డిమాండ్లపై కమిషన్‌ ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. అలాగే అగ్రిగోల్డ్ సమస్యను 21 రోజుల్లో పరిష్కరించాలటూ సీఎస్‌‌కు బాధ్యతలు అప్పగించింది. కొత్తగా లక్షమందికి పెన్షన్లు, మహిళా సంఘాలకు ఇసుక రీచ్‌ల అప్పగింతపై కేబినెట్‌ కీలక నిర్ణయాలు తీసుకుంది.

ఏపీ కేబినెట్‌ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ముఖ్యంగా వివిధ సామాజిక వర్గాల డిమాండ్లపై ఒక కమిషన్‌ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఎస్టీల్లో చేర్చాలని వడ్డెర, మత్స్యకారులు..... ఎస్సీల్లో చేర్చాలని రజకులు, నాయీ బ్రాహ్మణులు... ఇలా వివిధ సామాజిక వర్గాల నుంచి పెద్దఎత్తున డిమాండ్లు రావడంతో.... ప్రత్యేక కమిషన్‌ ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు. ఆయా సామాజికవర్గాల డిమాండ్లపై అధ్యయనం జరపనున్న కమిషన్‌... కేంద్రానికి పంపే విధంగా నివేదికలు ఇవ్వనుంది. 

ఇక అగ్రిగోల్డ్‌ సమస్య పరిష్కారానికి సీఎస్‌ నేతృత్వంలో కమిటీ ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు. అలాగే అర్హులందరికీ పక్కా ఇళ్లు నిర్మించి ఇవ్వాలని కేబినెట్‌ తీర్మానించింది. కాకినాడ తొండంగి దగ్గర పోర్ట్‌, తిరుపతిలో ఎలక్ట్రానిక్‌ మాన్యుఫాక్చరింగ్‌ క్లస్టర్-2 అభివృద్ధికి కేబినెట్‌ ఆమోదం తెలిపింది. అలాగే కమ్యూనికేషన్‌ టవర్ ఇన్‌ఫ్రా కోసం జాయింట్ వెంచర్ కంపెనీ ఏర్పాటుకు ఓకే చెప్పారు.

ఉచిత ఇసుకపై తీవ్ర ఆరోపణలు వస్తుండటంతో మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది. ఇసుక రీచ్‌లను స్వాధీనం చేసుకొని... మహిళా సంఘాలకు అప్పగించాలని భావిస్తోంది. అలాగే కొత్తగా లక్షమందికి పెన్షన్లు మంజూరు చేయాలని కేబినెట్‌లో నిర్ణయం తీసుకున్నారు.

English Title
AP CM Chandrababu Naidu Takes Key Decisions In AP Cabinet Meeting

MORE FROM AUTHOR

RELATED ARTICLES