వైసీపీ + బీజేపీ + జ‌న‌సేన = 2019 ఎన్నిక‌లు..?

Submitted by lakshman on Sat, 03/17/2018 - 03:37
 AP CM Chandrababu Naidu Controversial Comments On BJP and YCP

ఏపీలో  అంతా అనుకున్న‌ట్లే జ‌రుగుతుంది. గ‌త కొద్ది కాలంగా టీడీపీ  - బీజేపీకి పొస‌గ‌డంలేదు. నువ్వెంత అంటే నువ్వెంత అంటూ ఒక‌రిపై ఒక‌రు విమ‌ర్శ‌లు ప్ర‌తివిమ‌ర్శ‌ల‌తో రాజ‌కీయాన్ని వేడిపుట్టించారు.  
కేంద్రం ఇచ్చిన నిధుల‌తో రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి ఆ క్రెడిట్ అంతా టీడీపీ కొట్టేస్తుంద‌ని బీజేపీ నేత‌లు . తాము క‌ష్ట‌ప‌డి రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తే కేంద్రం నుంచి బీజేపీ నాయ‌కులు నిధులు రాకుండా చేస్తున్నార‌ని టీడీపీ నేత‌ల‌పై బీజేప నేత‌లు ఆరోణ‌లు చేశారు. ఆ ఆరోప‌ణ‌ల ప‌ర్వం మిత్ర‌ప‌క్షంగా ఉన్న బీజేపీ - టీడీపీ విడిపోయే ప‌రిస్థితి వ‌చ్చింది. ఈనేప‌థ్యంలో టీడీపీ స్టాండ్ ఏంటీ..? బీజేపీ చూపు ఎటువైపు అనేది ఆస‌క్తిక‌రంగా మారంది. 
మిత్రప‌క్షంగా ఉన్న ఎన్డీఏతో విడిపోయిన‌ట్లు సీఎం చంద్ర‌బాబు ప్ర‌కటించారు. ఈ సంద‌ర్భంగా బీజేపీ - వైసీపీ - జ‌న‌సేన పై విమ‌ర్శ‌లు చేశారు. జ‌న‌సేన ఆవిర్భావ స‌భ‌లో టీడీపీ పై ప‌వ‌న్ విమ‌ర్శ‌లు చేశారు. ఆ విమ‌ర్శ‌ల‌పై స్పందించిన చంద్ర‌బాబు ప‌వ‌న్ వెనుక బీజేపీ - వైసీపీ ఉంద‌ని..కాబ‌ట్టే ఇలా మాట్లాడుతున్నార‌ని అన్నారు. అంతేకాదు కేంద్రం వైసీపీ - జ‌న‌సేనతో లాబీయింగ్ ల‌కు పాల్ప‌డుతుంద‌ని సూచించారు. ఏపీకి ప్ర‌త్యేక‌హోదా కావాలంటే వైసీపీ ఎంపీలు రాజీనామా చేయాల‌ని , ప‌వ‌న్ క‌ల్యాణ్  ఆమరణ నిరాహార దీక్ష చేస్తే హోదా ఇస్తామని చెప్పింద‌ని అన్నారు.  
మ‌రి చంద్ర‌బాబు ఆరోప‌ణ‌ల్ని విశ్లేషిస్తే..వైసీపీ - బీజేపీ - జ‌న‌సేన‌లు క‌లిసి 2019 ఎన్నిక‌ల్లో పోటీ చేయోచ్చు అని అంచానా వేస్తున్నారు పొలిటిక‌ల్ విశ్లేష‌కులు. కాబ‌ట్టే జ‌న‌సేన ఆవిర్భావ స‌భ‌లో ప‌వ‌న్ క‌ల్యాణ్ టీడీపీ ని విమ‌ర్శించారే త‌ప్ప మిత్ర‌ప‌క్షంగా ఉన్న బీజేపీ ని , ప్ర‌తిప‌క్షంలో ఉన్న వైసీపీ గురించి ప‌ల్లెత్తు మాట అనలేద‌ని అంటున్నారు. 
దీనికితోడు పాద‌యాత్ర‌లో ఉన్న జ‌గ‌న్ ఏపీకి ప్ర‌త్యేక‌హోదా ఇస్తే బీజేపీతో క‌లిసి పోటీ చేస్తామ‌ని హింట్ ఇచ్చారు. అప్ప‌టి నుంచి వైసీపీ నేత‌లు పీఎం మోడీ అపాయింట్మెంట్ అడిగిందే త‌డువుగా వారితో మాట్లాడుతున్నారు. సీఎం చంద్ర‌బాబు ఢిల్లీకి  29 సార్లు వెళ్లినా మోక్షం క‌ల‌గ‌లేదు. దీనికి తోడు ప‌వ‌న్ క‌ల్యాణ్ కూడా త‌మ‌కు మ‌ద్ద‌తు ప‌లికార‌ని వైసీపీ ఎంపీ వరప్రసాద్ చేసిన వ్యాఖ్య కూడా ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. పవన్ కల్యాణ్‌కు తాము సహకరిస్తామని ఆయన చేసిన ప్రకటన ప్రకంపనలు సృష్టించింది. వరప్రసాద్ ప్రకటన తర్వాతనే చంద్రబాబుకు బిజెపి వ్యూహంపై ఓ స్పష్టత వచ్చి, తెగదెంపులు చేసుకున్నారని భావించవచ్చు. 
ఎన్నికల తర్వాతనే అవగాహన అయితే, జనసేన గానీ వైసిపి గానీ ఎన్నికల తర్వాతనే బిజెపితో పొత్తు పెట్టుకోవచ్చునని తెలుస్తోంది. ఈ విషయాన్ని గతంలో ఓసారి జగన్ స్పష్టంగానే చెప్పారు. ఆయన బిజెపికి దగ్గర కావాలని అనుకుంటున్నారనేది స్పష్టం. ఆ స్థితిలో ఎన్నికల తర్వాత అవసరమైతే ఇరువురు కూడా బిజెపికి మద్దతు ప్రకటిస్తారనే ప్రచారం సాగుతోంది.

English Title
AP CM Chandrababu Naidu Controversial Comments On BJP and YCP

MORE FROM AUTHOR

RELATED ARTICLES