టిక్‌ టాక్‌కు మరో షాక్‌..

టిక్‌ టాక్‌కు మరో షాక్‌..
x
Highlights

ఎంటర్టైన్మెంట్ యాప్ టిక్ టాక్ కు మరో ఎదురుదెబ్బ తగిలింది. టిక్‌ టాక్‌ యాప్‌ను గూగుల్‌ బ్యాన్‌ చేసిందని రాయిటర్స్‌ రిపోర్ట్‌ చేసింది. ఇటీవల మద్రాస్‌...

ఎంటర్టైన్మెంట్ యాప్ టిక్ టాక్ కు మరో ఎదురుదెబ్బ తగిలింది. టిక్‌ టాక్‌ యాప్‌ను గూగుల్‌ బ్యాన్‌ చేసిందని రాయిటర్స్‌ రిపోర్ట్‌ చేసింది. ఇటీవల మద్రాస్‌ హైకోర్టు బ్యాన్‌, సుప్రీం ఆదేశాలు నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది గూగుల్. కేంద్ర ప్రభుత్వం చర్యల నేపథ్యంలో టిక్‌టాక్‌ డౌన్‌లోడ్లను నిషేధించాలనే సుప్రీంకోర్టు ఆదేశాలను పాటిస్తూ గూగుల్‌ ఈ నిర్ణయం తీసుకున్నట్టు నిపుణులు చెబుతున్నారు.

టిక్‌ టాక్‌కు మరో షాక్‌టిక్‌ టాక్‌ యాప్‌ నిషేధంపై స్టే విధించాలంటూ చైనాకు చెందిన బైటెన్స్ టెక్నాలజీ అభ్యర్థనను సుప్రీంకోర్టు తిరస్కరించిన కొన్ని గంటల తరువాత గూగుల్ ఈ నిర్ణయం తీసుకోవడం సంచలనంగా మారింది. ప్రస్తుతం భారతదేశంలో గూగుల్ ప్లే స్టోర్‌లో టిక్‌ టాక్‌ అందుబాటులో లేదు. అయితే యాపిల్‌ స్టోర్‌లో అందుబాటులో ఉంది. తాజా పరిణామంపై గూగుల్‌, యాపిల్‌ అధికారికంగా స్పందించాల్సి ఉంది. నేడో రేపో యాపిల్ కూడా టిక్ టాక్ ను బ్యాన్ చేసే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం.

Show Full Article
Print Article
Next Story
More Stories