ఐదు రూపాయల క్యారీబ్యాగ్‌ కోసం .. ఏడు వేల రూపాయల ఫైన్ కట్టాడు ..

ఐదు రూపాయల క్యారీబ్యాగ్‌ కోసం ..  ఏడు వేల రూపాయల ఫైన్ కట్టాడు ..
x
Highlights

ప్లాస్టిక్ బ్యాగులపై నిషేధం విధించినప్పటి నుంచి కంపెనీలు డబ్బులు తీసుకుని క్యారీబ్యాగ్‌లు ఇచ్చే పద్ధతి ఇప్పుడు మొదలైంది. అయితే వినియోగదారులకు మెరుగైన...

ప్లాస్టిక్ బ్యాగులపై నిషేధం విధించినప్పటి నుంచి కంపెనీలు డబ్బులు తీసుకుని క్యారీబ్యాగ్‌లు ఇచ్చే పద్ధతి ఇప్పుడు మొదలైంది. అయితే వినియోగదారులకు మెరుగైన సేవలు అందించడంలో మాత్రం విఫలమైన పలు సంస్థలపై తెలంగాణ పౌరసరఫరాల శాఖ చర్యలు తీసుకుంది. ఆయా సంస్థలకు రూ.వేలల్లో జరిమానా విధించి వినియోగదారులకు ఊరట కలిగిచింది.

ఉప్పల్‌కు చెందిన శ్రీకాంత్ అనే వ్యక్తి ఇటీవల షాపర్స్ స్టాప్ షాపింగ్ మాల్‌‌లో షాపింగ్ చేశాడు. అతడు క్యారీ బ్యాగ్ కావాలని అడగ్గా సిబ్బంది రూ.5 వసూలు చేసి కవర్ ఇచ్చారు. అయితే ఆ కవర్‌పై సంస్థ లోగో ఉండటంపై శ్రీకాంత్ పౌరసరఫరాల శాఖ అధికారులకు ఫిర్యాదు చేశాడు. దీనితో లోగో ఉన్న క్యారీ బ్యాగ్‌ను ఉచితంగా ఇవ్వాలని, తన దగ్గర డబ్బులు వసూలుచేసి మరీ అమ్మిన కవర్‌పై వారు ప్రచారం చేసుకోవడం నేరం అవుతుందని పేర్కొన్నాడు. అతడి ఫిర్యాదుపై స్పందించి పౌరసరఫరాల శాఖ అధికారులు విచారణ జరిపారు.

సంస్థ లోగో ఉన్న బ్యాగులను ఉచితంగా ఇవ్వాలని గతంలో చండీగఢ్ వినియోగదారుల ఫోరం ఇచ్చిన తీర్పు ఆధారంగా అధికారులు షాపర్స్ స్టాప్ యాజమాన్యానికి నోటీసులు జారీచేసి రూ.7వేల జరిమానా విధించారు. ఇలాంటి సమస్య వస్తే 180042500333 టోల్‌ ఫ్రీ నంబరుకు ఫోన్ చేయాలని సూచిస్తున్నారు.


Show Full Article
Print Article
Next Story
More Stories