ఏపీ బడ్జెట్‌ 2018-19 హైలైట్స్‌

Submitted by arun on Thu, 03/08/2018 - 11:51
yanamala

ఆంధ్రప్రదేశ్‌ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు 2018-19కిగాను రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఏప్రిల్‌ 1, 2018 నుంచి ప్రారంభంకానున్న ఆర్థిక సంవత్సరానికి ఆయన గురువారం ఉదయం ఏపీ శాసనసభలో ఉదయం11.30గంటలకు బడ్జెట్‌ ప్రసంగ పాఠాన్ని మొదలుపెట్టారు. 2019లో సాధారణ ఎన్నికలు రానున్న నేపథ్యంలో ఈ బడ్జెట్‌ రాష్ట్ర ప్రభుత్వానికి అతిముఖ్యమైనది కాగా ప్రత్యేక హోదా విషయం రాష్ట్రాన్ని కుదిపేస్తున్న నేపథ్యంలో ప్రవేశ పెట్టిన ఈ బడ్జెట్‌లో ముఖ్యాంశాలు ఏమిటో ఒకసారి పరిశీలిద్దాం..

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర బడ్జెట్‌ 2018-19 హైలైట్స్‌..

మొత్తం బడ్జెట్‌ రూ.లక్షా 91 వేల 63 కోట్లు
రెవిన్యూ వ్యయం రూ.లక్షా 50 వేల 270కోట్లు
మూలధన వ్యయం రూ.28వేల 671 కోట్లు
ఆర్థిక లోటు అంచనా రూ.24,205 కోట్లు
వృద్ధిరేటు : 10.96శాతం


సంక్షేమ రంగం

సాంఘిక సంక్షేమానికి రూ.13,722కోట్లు
వెనుకబడిన వైశ్యులకు రూ. 35కోట్లు
కాపులకు రూ.వెయ్యి కోట్లు
కాపు సామాజిక విద్యార్థులకు రూ.750కోట్లు
దూదేకులవారికి కేటాయింపులు.. రూ.40కోట్లు
నాయీ బ్రాహ్మణులకు రూ.30కోట్లు
వెనుకబడిన తరగతుల సంస్థకు రూ.100కోట్లు
వాల్మీకీ బోయిలకు రూ. 50కోట్లు
క్రిస్టియన్‌ మైనారిటీలకు రూ.75కోట్లు
మహిళా శిశు సంక్షేమానికి రూ.2839
గిరిజన సంక్షేమం రూ.250 కోట్లు
బీసీ సంక్షేమం రూ.4477కోట్లు
కార్మిక ఉపాధి కల్పలనకు రూ.902కోట్లు
సామాజిక భద్రతకు రూ.3వేల 29కోట్లు
చేనేతల సంక్షేమానికి రూ.250కోట్లు
డ్వాక్రా మహిళలకు రూ.1000 కోట్లు
చంద్రన్న పెళ్లి కానుకల కింద బీసీలకు, ఎస్సీలకు చెరో రూ.100కోట్లు
నీరు చెట్టు పథకానికి రూ.500 కోట్లు
విద్యుత్‌, వ్యవసాయం, సాగునీటి రంగం

సాగునీటి రంగానికి రూ.16,978కోట్లు
ఇరిగేషన్‌ విభాగం కింద పోలవరానికి రూ.9వేల కోట్లు
వ్యవసాయానికి రూ.12వేల 355కోట్లు
విద్యుత్‌ రంగానికి రూ.5వేల 52కోట్లు
రుణమాఫీకి రూ.4100కోట్లు
పరిశ్రమలు, రవాణా

పరిశ్రమలకు రూ.3వేల 78కోట్లు
రవాణా రంగానికి రూ.4వేల 653కోట్లు
పర్యావరణ రంగానికి రూ.4వేల 899కోట్లు
ఫుడ్‌ ప్రాసెసింగ్‌ పరిశ్రమలకు రూ.300కోట్లు
రవాణా మరియు రోడ్డు భవనాల శాఖకు రూ.4,653కోట్లు
రోడ్ల అభివృద్ధికి రూ.1413 కోట్లు
 
గ్రామీణ, గృహ, పట్టణ రంగాలు

గ్రామీణాభివృద్ధికి రూ.20,815కోట్లు
పట్టణాభివృద్ధికి రూ.7,740కోట్లు
గృహనిర్మాణానికి రూ.3,679కోట్లు
గృహ నిర్మాణానికి స్థలం సేకరింపునకు రూ.575కోట్లు
మున్సిపల్‌ శాఖకు రూ.7,761కోట్లు
మంచినీరు, పారిశుద్ధ్యానికి రూ.2,623కోట్లు
విశాఖ చెన్నై కారిడార్‌ రూ.1168కోట్లు
స్మార్ట్‌ సిటీలకు రూ.800కోట్లు
స్వచ్ఛభారత్‌కు రూ,1450కోట్లు
ఆర్టీసీకి రూ.200కోట్లు
అమరావతి నిర్మాణానికి రూ.7,741కోట్లు
అమృత్‌ పథకానికి రూ.490 కోట్లు
 
విద్యా, వైద్యం, సాంకేతిక రంగం

సాధారణ విద్యారంగానికి రూ.24,180కోట్లు
సాంకేతిక విద్యకు రూ.818కోట్లు
స్కిల్‌ డెవలప్‌మెంట్‌కు రూ.300 కోట్లు
మోడల్‌ స్కూల్స్‌ రూ.377కోట్లు
రెసిడెన్షియల్‌ స్కూల్స్‌కు రూ.670కోట్లు
నిరుద్యోగ భృతికి రూ.1000 కోట్లు
క్రీడలు, యువజన సర్వీసులకు రూ.1,635 కోట్లు
వైద్యరంగానికి రూ.8,463కోట్లు
సమాచార శాఖకు రూ.224కోట్లు
వివిధ విశ్వవిద్యాలయాలకు మౌలిక సదుపాయాలు రూ.20కోట్లు
సాంస్కృతిక రంగం రూ.94.98కోట్లు
ఎన్టీఆర్‌ వైద్య సేవలు రూ.1000 కోట్లు
వ్యవసాయ విశ్వవిద్యాలయం రూ.357కోట్లు
మున్సిపల్‌ శాఖకు రూ.7,761కోట్లు
ఎంఎస్‌ఎంఈ రంగానికి రూ.200 కోట్లు
పారిశ్రామిక వాణిజ్య విభాగానికి రూ.3,075కో్ట్లు
ఇన్‌ఫర్మేషన్‌ టెక్నాలజీ కింద రూ.1000కోట్లు
వ్యవసాయ బడ్జెట్‌ రూ.19,070కోట్లు

English Title
ap budget 2018-19 highlights

MORE FROM AUTHOR

RELATED ARTICLES