మంగళవారం ఏపీ బంద్ : వైయస్ జగన్

Submitted by nanireddy on Sat, 07/21/2018 - 09:54
ap bandh call for ys jagan in thuesday

నిన్న పార్లమెంటులో అవిశ్వాస తీర్మానం వీగిపోయిన సందర్బంగా వైసీపీ అధినేత వైయస్ జగన్ మీడియాతో మాట్లాడారు.. మరోసారి పార్లమెంటు సాక్షిగా ఏపీకి అన్యాయం జరిగిందన్న జగన్ అందుకు నిరసనగా మంగళవారం(ఈనెల 24) ఏపీ బందుకు పిలుపునిచ్చారు. టీడీపీ ఎంపీలు వారు ఏదో సాధిస్తారన్న నమ్మకాన్ని వమ్ము చేశారన్నారు. ఏపీకి ప్రత్యేకహోదా ఇస్తామని ఆనాడు ఎన్నికల ప్రచారం సాక్షిగా ప్రధాని మోడీ, సీఎం చంద్రబాబునాయుడు స్పష్టం చేసి ఇప్పుడు ఇద్దరు మోసం చేశారని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో 25 మంది ఎంపీలను తమ పార్టీ గెలుచుకుంటుంది అప్పుడు ఎందుకు ప్రత్యేక హోదా రాదో చూద్దాం అని అన్నారు. ఇక కేవలం ప్రజాప్రతినిధులు పోరాటం చేస్తేనే మన సంకల్పం నెరవేరదని.. సామాన్యులు సైతం యుద్ధంలో భాగస్వాములు కావాలని అన్నారు. అంతేకాకుండా  మొత్తం 25 మంది ఎంపీలు రాజీనామాలు చేసి నిరాహార దీక్షకు దిగాలని సూచించారు. అప్పుడే దేశవ్యాప్తంగా ప్రత్యేక హోదా అన్న అంశం ఫోకస్ అవుతుందన్నారు. అలాగే అవిశ్వాస తీర్మానం సందర్బంగా టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ మాట్లాడిన విధానంపై మండిపడ్డారు..'గల్లా మాట్లాడిన మాటలు గత నాలుగేళ్లుగా మేం చెబుతున్న మాటలు కాదా..?. గత నాలుగేళ్లుగా యువభేరీ మొలుకుని అసెంబ్లీ వరకు మేం చేసిన ప్రసంగాలు.. గల్లీ నుంచి ఢిల్లీ దాకా మేం చేసిన ధర్నాలను ఒక్కసారి చూడండి. నాలుగేళ్లుగా మేం మాట్లాడిన మాటలే గల్లా జయదేవ్ కూడా పార్లమెంట్‌లో చెప్పాడంతే' అని అన్నారు. 

English Title
ap bandh call for ys jagan in thuesday

MORE FROM AUTHOR

RELATED ARTICLES