ఆ దీవికి ఇవే చివరి ఎన్నికలు?

ఆ దీవికి ఇవే చివరి ఎన్నికలు?
x
Highlights

పశ్చిమ బెంగాల్ లోని సుందర్ బన్ దీవులు కనుమరుగు కానున్నాయా తాజాగా జరిగిన లోక్ సభ ఎన్నికలే అక్కడి ప్రజలకు చివరి ఎన్నికలు కాబోతున్నాయా ఓటు వేసిన వారి...

పశ్చిమ బెంగాల్ లోని సుందర్ బన్ దీవులు కనుమరుగు కానున్నాయా తాజాగా జరిగిన లోక్ సభ ఎన్నికలే అక్కడి ప్రజలకు చివరి ఎన్నికలు కాబోతున్నాయా ఓటు వేసిన వారి మాటలు వింటుంటే నిజమే అనిపిస్తున్నాయి. గడిచిన మూడు దశాబ్దాలుగా సగం దీవి బంగాళాఖాతంలో మునిగిపోయాయి. ప్రకృతి ప్రకోపంతో గ్రామాలన్ని సముద్ర ఉప్పెనకు కొట్టుకుపోతున్నాయి. ప్రభుత్వాలు మారుతున్నా స్థితి గతులు మారటం లేదని ఇక్కడి ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

పశ్చిమ బెంగాల్ లోని సుందర్ బన్ డెల్టాలోని సువిశాల దీవి ఘోరామారా గ్లోబల్ వార్మింగ్ ప్రకృతి ప్రకోపంతో ఈ దీవి రెండు మూడేళ్లలో కనుమరుగు కాబోతున్నాయి గడిచిన మూడు దశాబ్దాలుగా సగం దీవి బంగాళాఖాతంలో మునిగిపోయింది. ప్రస్తుతం నాలుగు చదరపు కిలో మీటర్ల విస్తీర్ణం మాత్రమే మిగిలి ఉంది. కేవలం వంద మంది మాత్రమే ఘోరామారా దీవుల్లో నివసిస్తున్నారు. తాజాగా జరిగిన లోక్ సభ ఎన్నికల్లో ఓటు వేసిన ఓటర్లు ఇవే చివరి ఎన్నికలుగా భావిస్తున్నారు. ఎన్నో ప్రభుత్వాలు మారుతున్న తమ స్థితిగతులు మారటం లేదని ఘోరామారా దీవి వాసులు ఎన్నికల అధికారుల ముందు వాపోయారు.

ప్రకృతి వైపరిత్యాలతో చాలా మంది దీవిని ఖాళీ చేసి వెళ్తున్నారు ఉన్న కొద్ది మంది ఒడ్డున ఉన్న గ్రామాల్లో రోజు కూలీలుగా స్థిరపడ్డారు. మూడు దశాబ్దాల్లో భూములు నీట మునగడంతో వ్యవసాయం కనుమరుగైంది. కాలుష్యం, గ్లోబల్‌వార్మింగ్‌తో ఘోరామారా ఒక్కటే కాదు దీని చుట్టుపక్కల ఉన్న దీవులకూ ముప్పు పొంచి ఉందని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దినదిన గండంగా గడుపుతున్న ఇక్కడి ప్రజలు ప్రభుత్వాలు పునరావాసం కల్పిస్తే దీవిని ఖాళీ చేస్తామంటున్నారు. ఇకనైన ప్రభుత్వాలు సుందర్ బన్ దీవులను ప్రకృతి వైపరిత్యాల నుండి కాపాడడానికి చర్యలు తీసుకోనట్లయితే కోస్తా ముఖ ద్వారంలో మరిన్ని సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories