logo

పెట్రోల్ అమ్మిన అనుష్క..

పెట్రోల్ అమ్మిన అనుష్క..

భాగ‌మ‌తి సినిమాతో భారీ హిట్ కొట్టిన అనుష్క ప్ర‌స్తుతం ఆ స‌క్సెస్ ని ఫుల్ గా ఎంజాయ్ చేస్తుంది. అయితే తాజాగా ఈ అమ్మ‌డు పెట్రోల్ బంక్‌లో పెట్రోల్ కొడుతూ క‌నిపించ‌డం అందరికి షాకింగ్‌గా మారింది. ఏదో సినిమా కోసం అనుకుంటే తప్పులో కాలేసినట్టే. లక్ష్మీ మంచు హోస్ట్‌గా కొన్ని నెలల క్రితం మేము సైతం అనే ప్రోగ్రాం వచ్చింది గుర్తుంది కదా. ఆ ప్రోగ్రాం సీజన్ -2 షూటింగ్ స్టార్ట్ అయింది.

ఈ ప్రోగ్రాంలో అనుష్క గెస్ట్‌గా రాబోతోంది. ఈ ప్రోగ్రాం కాన్సెప్ట్ వచ్చేసి, ఈ ప్రోగ్రాంకి గెస్ట్‌గా వ‌చ్చేవారు ఏదో ఒక‌ ప‌ని చేసి ఆ వ‌చ్చిన డ‌బ్బుతో పేద‌ల‌కి సాయం చేయ‌డం ఈ కార్యక్ర‌మం ముఖ్య ఉద్దేశం. మేము సైతం సీజ‌న్ 1 పూర్తి కాగా త్వ‌ర‌లో సీజ‌న్ 2 స్టార్ట్ కానుంది. ప్ర‌స్తుతం దీనికి సంబంధించి షూటింగ్ స్టార్ట్ అయింది. ఇందులో భాగంగా అనుష్క హైదరాబాద్‌లోని ఫిలింనగర్ రోడ్ నంబర్ 1లో పెట్రోల్ అమ్మి డబ్బు సంపాదించింది. ఆమెని చూసేందుకు అభిమానులు బారులు తీరారు.

లైవ్ టీవి

Share it
Top