గూగుల్ ఆండ్రాయిడ్‌ 'పై' వచ్చేసింది

గూగుల్ ఆండ్రాయిడ్‌ పై వచ్చేసింది
x
Highlights

టెక్నాలజీ ప్రియులకు గూగుల్‌ శుభవార్త అందించింది. తన ఆండ్రాయిడ్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌(ఓఎస్‌)లో కొత్త వెర్షన్‌ ‘పై’ను మంగళవారం అందుబాటులోకి తెచ్చింది....

టెక్నాలజీ ప్రియులకు గూగుల్‌ శుభవార్త అందించింది. తన ఆండ్రాయిడ్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌(ఓఎస్‌)లో కొత్త వెర్షన్‌ ‘పై’ను మంగళవారం అందుబాటులోకి తెచ్చింది. గూగుల్ ఆండ్రాయిడ్‌ ఓఎస్‌ సిరీస్‌లో ఇది తొమ్మిదవది. ఈ వర్షన్లోని స్మార్ట్ ఫోన్ ను ఎలా వాడుతున్నారు, ఎంత సేపు వాడుతున్నారు, మితిమీరిన వాడకాన్ని నియంత్రించడానికి ఈ “Digital Wellbeing” అందుబాటులో ఉంది కొన్ని అప్లికేషన్లపై రోజుకు ఎంత సమయం వెచ్చిస్తున్నారో ఈ “Digital Wellbeing Dashboard” ద్వారా తెలుసుకోవచ్చు. ఒకవేళ అప్లికేషన్ ను ఇంత సమయం కన్నా ఎక్కువసేపు వాడకూడదనుకుంటే అలా కూడా సమయాన్నివ్ కూడా సెట్ చేసుకోవచ్చు. అలాగే ఆండ్రాయిడ్ ఈ పై లో ఈ వాడని అప్లికేషన్లు బాక్గ్రౌండ్ లో రన్ అవ్వకుండా ఆటోమేటిక్ గా నియంత్రిస్తుంది. మొబైల్స్‌ లో సమాచార గోప్యత లోపాలపై భారత్‌ సహా ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో గూగుల్‌ ‘పై’ ఓఎస్‌లో ప్రైవసీకి పెద్దపీట వేసింది.

Show Full Article
Print Article
Next Story
More Stories