టీడీపీకి కీలకనేత రాజీనామా.. వైసీపీలో చేరుతున్నట్టు ప్రకటన!

Submitted by nanireddy on Sun, 07/22/2018 - 09:56
andhra-pradesh/former-amc-chairman-bobby-resigned-tdp

ఎన్నికలు ముంచుకొస్తున్న వేళా తూర్పుగోదావరి జిల్లాలో టీడీపీకి షాక్ తగిలింది. ఆ పార్టీ పిఠాపురం నాయకుడు మార్కెట్ కమిటీ ఛైర్మెన్ మొగలి వీరవెంకట సత్యనారాయణ టీడీపీకి రాజీనామా చేశారు. రెండు రోజుల్లో వైసీపీ అధినేత వైయస్ జగన్ సమక్షంలో ఆ పార్టీలో చేరబోతున్నట్టు ప్రకటించారు. అంతకుముందు  సత్యనారాయణ పార్టీ మారుతున్నట్టు ప్రకటన రావడంతో పిఠాపురం ఎమ్మెల్యే  ఎస్‌వీఎస్‌ఎన్‌ వర్మ, జిల్లా టీడీపీ అధ్యక్షురాలు తోట సీతారామలక్ష్మి ఆయనను బుజ్జగించే ప్రయత్నం చేశారు. కానీ శుక్రవారం వైసీపీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు, పెండెం దొరబాబు అయన వద్దకు వచ్చి పార్టీలో చేరవలసిందిగా ఆహ్వానించారు. దాంతో అయన టీడీపీకి రాజీనామా చేసి వైసీపీలో చేరుతున్నట్టు ప్రకటించారు.  

English Title
andhra-pradesh/former-amc-chairman-bobby-resigned-tdp

MORE FROM AUTHOR

RELATED ARTICLES