డ్రోన్లతో జొమాటో ఫుడ్‌ డెలివరీ

డ్రోన్లతో జొమాటో ఫుడ్‌ డెలివరీ
x
Highlights

ఫుడ్ డెలివరీ యాప్ జొమాటో సరికొత్త రికార్డు సృష్టించింది. డ్రోన్ల ద్వారా ఆహార పదార్థాలను డెలివరీ చేసే ప్రయోగాన్ని విజయవంతంగా పరీక్షించింది. కేవలం 10...

ఫుడ్ డెలివరీ యాప్ జొమాటో సరికొత్త రికార్డు సృష్టించింది. డ్రోన్ల ద్వారా ఆహార పదార్థాలను డెలివరీ చేసే ప్రయోగాన్ని విజయవంతంగా పరీక్షించింది. కేవలం 10 నిమిషాల్లో 5 కిలోమీటర్లు ప్రయాణించగల హైబ్రిడ్‌ డ్రోన్‌ ద్వారా బుధవారం పరీక్ష నిర్వహించినట్లు జొమాటో తెలిపింది. ఇకపోతే జోమాటో గత ఏడాది డిసెంబరులో గుర్‌గావ్‌కు చెందిన స్టార్టప్‌ టెక్‌ఈగిల్‌ను కొనుగోలు చేసింది. డ్రోన్ల ద్వారా ఫుడ్‌ డెలివరీ లక్ష్యంగా కంపెనీ ఈ నిర్ణయం తీసుకుంది. డ్రోన్ విషయానికి వస్తే.. ఇది 10 నిమిషాల్లోనే 5 కిలోమీటర్ల దూరం ప్రయాణించగలదు. డ్రోన్‌ గంటకు గరిష్ఠంగా 80 కిలోమీటర్ల వేగంతో వెళ్తుంది. 5 కిలోల బరువు కలిగిన ఆహారాన్ని మోసుకెళ్లగలదు. రోడ్డు మార్గం కన్నా ఆకాశ మార్గాన ఆహార పదార్థాలను మరింత వేగవంతంగా డెలివరీ చేయాలనే ఉద్దేశంతో ఈ నూతన సర్వీసులకు శ్రీకారం చుట్టినట్లు కంపెనీ వ్యవస్థాపకుడు, సీఈవో దీపిందర్ గోయల్ తెలిపారు. దీనికి టెక్నాలజీ అంత సిద్ధంగా ఉన్నప్పటికీ నియంత్రణ మండళ్లు అనుమతించాల్సి ఉంటుందన్నారు.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories