క్రికెట్ బంతిని ఎలా తయారు చేస్తారంటే..!

క్రికెట్ బంతిని ఎలా తయారు చేస్తారంటే..!
x
Highlights

క్రికెట్‌లో పేసర్లు విసిరే అద్భుతమైన స్వింగర్లను, స్పినర్లు చేసే మాయాజాలాన్ని అభిమానులు ఆస్వాదిస్తుంటారు. పేసర్లు కానీ స్పినర్లు కానీ గేమ్ లో బంతితో...

క్రికెట్‌లో పేసర్లు విసిరే అద్భుతమైన స్వింగర్లను, స్పినర్లు చేసే మాయాజాలాన్ని అభిమానులు ఆస్వాదిస్తుంటారు. పేసర్లు కానీ స్పినర్లు కానీ గేమ్ లో బంతితో విన్యాసాలు చేయింస్తున్నారు. బౌలర్లు ఇలా చేయాలంటే దానికి కారణం బంతి. అవున ఇంతకీ ఆ బంతిని ఎలా తయారుచేస్తారో తెలుసా.. తోలును ఉపయోగించి చేస్తారు. బౌలర్లతో పాటు బంతికి సత్తా ఉంటేనే.. బాల్‌‌ని ఇష్టం వచ్చినట్లు ఉపయోగించుకోవచ్చు. ఇన్‌స్వింగర్, ఆఫ్‌స్వింగర్, గూగ్లీ, స్పిన్.. ఇలా ఏదైనా సర్ బౌలర్ వేయాలంటే బంతి ఆకారం, కుట్లు సరిగ్గా ఉండాలి.

ఐసీసీ నిబంధనల ప్రకారం బంతి 156 గ్రాముల బరువుండాలి. ఆ బరువు కంటే తక్కువగా ఉన్న లేక ఎక్కువైన ఆ బంతిని గేమ్‌లో ఉపయోగించారు. సాధరణంగా వన్డే మ్యాచుల్లో ఫుల్ కార్క్‌ను ఉపయోగిస్తారు. ఇక టీ20 లాంటి మ్యాచ్‌లో హాఫ్ కార్క్‌ను వాడతారు. బంతిని తోలుతో తయారు చేస్తారు. తోలును నాలుగు ముక్కలుగా కత్తిరించి, లోపలి నుంచి వాటిని చేతితో కుడతారు. ఆ తరువాత వీటిని లామినేషన్ చేస్తారు. దీన్ని మెషీన్ మీద పెట్టి, రెండు భాగాలనూ అతికిస్తారు. ఆ తరువాత రెండు వరుసల్లో కుట్లు వేస్తారు. దాంతో బంతి పూర్తి రూపాన్ని సంతరించుకుంటుంది.

బంతికి ఆ ఆకృతి రావలంటే 60-70 డిగ్రీలకు వరకు వేడి చేస్తారు. బంతి ఆకారం సరిగ్గా ఉందా లేదా అన్ని నిర్ధారించేందుకు ఓ టెస్ట్ కూడా ఉంటుంది. ఓ ప్రత్యేకమైన రంధ్రం గుండా బంతులను దూరుస్తారు. అందులో దూరగలిగినవే గేమ్‌లోకి వెళ్తాయి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories