ప్రత్యేక హోదా కోసం ఏపీలో బంద్‌

Submitted by arun on Mon, 04/16/2018 - 10:32
ap

ప్రత్యేక హోదా ఇవ్వాలన్న డిమాండ్‌తో ఏపీలో బంద్‌ కొనసాగుతోంది. ప్రత్యేక హోదా సాధన సమితి ఇచ్చిన పిలుపుతో ప్రధాన ప్రతిపక్షాలైన వైసీపీ, కాంగ్రెస్, జనసేన, వామపక్ష పార్టీలు బంద్‌లో పాల్గొంటున్నాయి. ఉదయం ఐదు గంటల నుంచే బస్టాండ్ల వద్ద విపక్షాలు ధర్నాలు చేపట్టాయి. దీంతో బస్సులు డిపోల నుంచి బయటకు రాలేదు. రోడ్డెక్కిన ఒకటీ అరా బస్సులను ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలను మూసివేయగా, పాలిటెక్నిక్ పరీక్షలను వాయిదా వేశారు.

ప్రత్యేక హోదా సాధన సమితి ఆధ్వర్యంలో జరుగుతున్న బంద్‌కు టీడీపీ, బీజేపీ దూరంగా ఉన్నాయి. బంద్ కారణంగా ప్రజలకు కష్టాలు పెరుగుతాయనే ఉద్దేశంతోనే బంద్‌కు దూరంగా ఉంటున్నట్టు సీఎం చంద్రబాబు తెలిపారు. అయితే, ప్రత్యేక హోదాకు తమ మద్దతు ఉంటుందన్న చంద్రబాబు ఢిల్లీలో ఆందోళన చేపడితే ఏ పార్టీకైనా తాము మద్దతు ఇస్తామని చెప్పారు. బంద్‌ను శాంతియుతంగా నిర్వహించాలని కోరారు. అల్లర్లు, ఉద్రిక్తతలు తలెత్తకుండా చూడాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు.

English Title
andhra pradesh bandh

MORE FROM AUTHOR

RELATED ARTICLES