నేడు కోల్‌కతాకు ఏపీ సీఎం చంద్రబాబు

నేడు కోల్‌కతాకు ఏపీ సీఎం చంద్రబాబు
x
Highlights

టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబు ఇవాళ కోల్‌కతా వెళ్లనున్నారు. బీజేపీయేతర పార్టీలను ఏక తాటిపైకి తెచ్చేందుకు కృషి చేస్తున్న చంద్రబాబు...

టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబు ఇవాళ కోల్‌కతా వెళ్లనున్నారు. బీజేపీయేతర పార్టీలను ఏక తాటిపైకి తెచ్చేందుకు కృషి చేస్తున్న చంద్రబాబు ఇప్పటికే పలువురు జాతీయ పార్టీ నేతలతో సమావేశమయ్యారు. ఇప్పుడు పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీని కలిసేందుకు వెళ్లనున్నారు. కాంగ్రెస్, ఇతర పార్టీలతో కలిసి కూటమి ఏర్పాటు, సానుకూలతపై ఇరువురు నేతలు చర్చించనున్నారు. జనవరిలో తృణమూల్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో జరగనున్న భారీ ర్యాలీ, ఢిల్లీలో ఈనెల 22న నిర్వహించనున్న బీజేపీయేతర పక్షాల విందు సమావేశంపైనా భేటీలో చర్చించనున్నట్టు తెలుస్తోంది.

ఇటీవల వరుసగా జాతీయ నాయకులతో మంతనాలు జరుపుతున్న చంద్రబాబు, ఆ విషయాలను ఎప్పటికప్పుడు ఫోన్ ద్వారా మమత బెనర్జీకి తెలియజేస్తున్నట్టు తెలుస్తోంది. ఇటీవల ఢిల్లీ వెళ్లి కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సహా జాతీయ నేతలను కలిసిన విషయంతోపాటు మాజీ ప్రధాని దేవెగౌడ, కుమారస్వామి, స్టాలిన్‌ను కలిసి చర్చించిన విషయాన్ని కూడా ఆమెకు వివరించినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో నేరుగా వెళ్లి ఆమెతో మరిన్ని విషయాలపై చర్చించి కూటమికి తుది రూపురేఖలు తేవాలని చంద్రబాబు నిర్ణయించినట్టు తెలుస్తోంది.

ఇవాళ మధ్యాహ్నం 12గంటలకు ప్రత్యేక విమానంలో కోల్‌కతాకు బయల్దేరుతున్న చంద్రబాబు కోల్‌కతా ఎయిర్‌పోర్టు నుంచి రోడ్డు మార్గంలో నాబాన్నలోని సీఎం కార్యాలయానికి చేరుకుంటారు. సాయంత్రం 4గంటలకు మమతా బెనర్జితో భేటీ ఆయన అవుతారు. కోల్‌కతాకు చంద్రబాబుతోపాటు మంత్రులు యనమల రామకృష్ణుడు, కళావెంకట్రావు కూడా వెళ్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories