ఉత్కంఠ పోరులో ఆఫ్గాన్ పై పాక్ విజయం ..

ఉత్కంఠ పోరులో ఆఫ్గాన్ పై పాక్ విజయం ..
x
Highlights

క్రికెట్ లో సంచలనాలు పాక్ పెట్టింది పేరు .. ప్రపంచ కప్ లో భాగంగా నిన్న ఆఫ్గనిస్తాన్ జట్టుతో జరిగిన మ్యాచ్ లో పాకిస్థాన్ పీకలదాకా మ్యాచ్ ని తెచ్చుకొని...

క్రికెట్ లో సంచలనాలు పాక్ పెట్టింది పేరు .. ప్రపంచ కప్ లో భాగంగా నిన్న ఆఫ్గనిస్తాన్ జట్టుతో జరిగిన మ్యాచ్ లో పాకిస్థాన్ పీకలదాకా మ్యాచ్ ని తెచ్చుకొని ఫైనల్ గా విజయకేతనం ఎగరవేసింది .. ఇమాద్ వసీమ్ అద్బుతమైన ఇన్నింగ్స్ తో పాక్ ని గట్టేకించాడు .. ఈ అద్బుతమైన విజయంతో పాక్ టాప్ 4 లో ప్లేస్ సంపాదించుకుంది .. ఇప్పటికి ఎనమిదో మ్యాచ్ ఆడినా ఆఫ్గనిస్తాన్ అన్ని మ్యాచ్ లో ఆడి ఒడి సెమిస్ నుండి నిష్క్రమించింది ..

మొదటగా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న నిర్ణిత 50 ఓవర్లకు గాను 9 వికెట్లను కోల్పోయి .. 227 పరుగులు చేసింది . ఇందులో అస్గర్ ఆఫ్గాన్ (42: 35 బంతుల్లో 3x4, 2x6), నజీబుల్లా (42: 54 బంతుల్లో 6x4), రహ్మత్ షా (35: 43 బంతుల్లో 5x4) మాత్రమే చెప్పుకోదగ్గ స్కోర్లు చేశారు. పాక్ బౌలర్లలో షహీన్ అఫ్రిది (4/47), ఇమాద్ వసీమ్ (2/48) , వహాబ్ రియాజ్ (2/29) వికెట్లు తీసారు ..

228 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన పాక్ కి ఆరంభం లోనే ఎదురుదెబ్బ తగిలింది . అ జట్టు ఓపెనర్ ఫకార్ జమాన్(0) డక్కౌట్ అయ్యాడు . అనంతరం క్రీజ్ లోకి వచ్చిన అజామ్ (45: 51 బంతుల్లో 5x4) మరో ఓపెనర్ ఇమామ్ ఉల్ హక్(36: 51 బంతుల్లో 4x4) తో కలిసి పాక్ ని ఆదుకున్నారు .. ఒక దశలో మ్యాచ్ ని వీరే గెలిపించేలా కనిపించారు కానీ ఆఫ్గాన్ స్పీనర్లు ముజీబ్ (2/34), మహ్మద్ నబీ (2/23) పాక్ మిడిలార్డర్ ని మిడిలార్డర్ ని కుప్పకుల్చారు .. దీనితో ఒక్కసారిగా మ్యాచ్ ఆఫ్గనిస్తాన్ వైపు టర్న్ అయింది .

దీనితో ఒక్కసారిగా పాక్ పై ఒత్తిడి పెరిగిపోయింది. ఇమాద్ వసీమ్ మరియు వాహబ్ రియాజ్ ఇద్దరు కలిసి పాక్ ని ఆదుకున్నారు . వాహబ్ రియాజ్ మ్యాచ్ కి ఇంకా రెండు బంతులు ఉండగా మ్యాచ్ ముగిస్తుంది అనగా పాక్ ని విజయాన్ని లాంచనంగా పూర్తి చేసాడు .. దీనితో పాక్ సెమిస్ అవకశాలను సజీవంగా ఉంచుకుంది ..

Show Full Article
Print Article
Next Story
More Stories