బిగ్ బాస్ హౌస్ లోకి యాంకర్ ప్రదీప్.. రాగానే దీప్తి సునైనాను...

Submitted by arun on Thu, 07/19/2018 - 14:23
Anchor pradeep

బిగ్ బాస్ తెలుగు 2 రియాల్టీ షోకు బుల్లితెర ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఊహించని పరిణామాలు, ఎక్స్‌పెక్ట్స్ చేయని టాస్క్‌లు, ఆడియన్స్ షాకయ్యే ఎలిమినేషన్లతో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని ఆసక్తికర మలుపులతో ఈ‌షో దూసుకెళుతోంది. నిన్నటి ఎపిసోడ్ లో లగ్జరీ బడ్జెట్ టాస్క్ లో ఇచ్చిన ‘ బిగ్ బాస్ బ్లాక్ బస్టర్ సినిమా’ కాన్సెప్ట్ తో ఇంటి సభ్యులు చేసిన హంగామా వీక్షకులను బాగానే ఆకట్టుకుంది. కాగా.. ఈ రోజు బిగ్ బాస్ హౌస్ లోకి యాంకర్ ప్రదీప్ అడుగుపెట్టాడు. అయితే.. వైల్డ్ కార్డ్ ఎంట్రీగా ప్రదీప్ అడుగుపెట్టినట్లు తెలుస్తోంది.  ప్రదీప్ ఇంట్లోకి అడుగుపెట్టిన వీడియో ప్రోమోని స్టార్ మా విడుదల చేసింది. ప్రదీప్ హౌజ్ లోకి అడుగుపెట్టిన వెంటనే సందడి మొదలైంది. ప్రదీప్ చెప్పిన పలు విషయాలకు ముందుగా దీప్తి సునైనా కంట తడి పెట్టుకుంది. ఆ తర్వాత ఒక్కొక్కరుగా కన్నీరు పెట్టుకున్నారు. అయితే.. ఆనందంతో వారు ఏడ్చినట్లు అర్థమౌతోంది. 
 

English Title
Anchor pradeep wildcard entry in biggboss house

MORE FROM AUTHOR

RELATED ARTICLES