బిగ్‌బాస్ హౌస్‌లోకి యాంకర్‌ ప్రదీప్.. అసలు నిజం ఇదేనట!

Submitted by arun on Fri, 07/20/2018 - 10:51
Anchor pradeep

ప్రస్తుతం బుల్లితెర అంటే ప్రదీప్.. ప్రదీప్ అంటే బుల్లితెరగా మారిపోయింది. ప్ర‌దీప్ చేసే షోల‌కు వ‌చ్చే రేటింగ్ చెప్ప‌న‌క్క‌ర‌లేదు. చాలా షోస్‌లో ప్రదీప్ యాంకర్‌గా ఉన్నాడు. ఇతని యాంకరింగ్‌కి అభిమానులు ఓ రేంజ్‌లో ఉన్నారు. ప్రదీప్ ఉంటే షో 100 శాతం హిట్ అనేది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే ఇటీవల బిగ్‌బాస్ షోలో ఓ ప్రోమో చూశాం. ప్రదీప్ షోలోకి ఎంట్రీ ఇవ్వడం. ప్రోమోలో చెప్పినట్టుగానే ప్రదీప్ నిన్న బిగ్‌బాస్ హౌస్‌లో అడుగు పెట్టాడు. స్టార్ యాంకర్‌గా ఫుల్ బిజీగా ఉండే ప్రదీప్...షోలోకి రావడం ఏంట‌ని అందరూ ఆశ్చ‌ర్య‌పోతున్నారు. ఇంకేముంది వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇచ్చాడని.. అభిమానులు సంబరపడిపోయారు. కానీ ఇక్కడే ఉంది అసలు పాయింట్. నిజానికి ప్రదీప్ చేస్తున్న షోలన్నీ పక్కన పెట్టేసి బిగ్‌బాస్ హౌస్‌లో కూర్చుండిపోతాడా? అనేది అంద‌రి ప్ర‌శ్న‌. అయితే ఢీ 10 ముగియడంతోనే బిగ్‌బాస్‌కి ఎంట్రీ ఇచ్చాడు ప్రదీప్. అది జస్ట్ గెస్ట్‌గా మాత్రమేనని తెలుస్తోంది. షోకి రేటింగ్ పెంచడం కోసమే ప్రదీప్‌ని గెస్ట్‌గా ప్రవేశపెట్టారని టాక్ వినిపిస్తోంది.
 

English Title
Anchor Pradeep hungama in Bigg boss house

MORE FROM AUTHOR

RELATED ARTICLES