కౌన్సిలింగ్‌కు హాజ‌రుకానున్న యాంక‌ర్ ప్ర‌దీప్‌..

కౌన్సిలింగ్‌కు హాజ‌రుకానున్న యాంక‌ర్ ప్ర‌దీప్‌..
x
Highlights

న్యూ ఇయర్‌ వేడుకల్లో మద్యం తాగి...వాహనాలు నడిపిన వారికి ఇవాళ పోలీసులు కౌన్సిలింగ్‌ ఇవ్వనున్నారు. డిసెంబర్‌ 31వ తేదీ 150 డ్రంక్‌ అండ్ డ్రైవ్‌...

న్యూ ఇయర్‌ వేడుకల్లో మద్యం తాగి...వాహనాలు నడిపిన వారికి ఇవాళ పోలీసులు కౌన్సిలింగ్‌ ఇవ్వనున్నారు. డిసెంబర్‌ 31వ తేదీ 150 డ్రంక్‌ అండ్ డ్రైవ్‌ టీంలు...22వేల 450 వాహనాలను తనిఖీలు నిర్వహించాయి. ఇందులో తాగి వాహనాలు నడిపిన వారిపై 16 వందల 83 కేసులు నమోదు చేశారు. 1,683 వాహనాలను సీజ్‌ చేసి...స్టేషన్లకు తరలించారు. మూడు కమిషనరేట్ల పరిధిలో మొత్తం 2449 కేసులు నమోదయ్యాయి.

మద్యం తాగి వాహనాలు నడిపి పోలీసులకు పట్టుబడ్డ వారికి...కాసేపట్లో కౌన్సిలింగ్‌ ఇవ్వనున్నారు. డ్రంకెన్‌ డ్రైవ్‌లో పట్టుబడిన వారికి తల్లిదండ్రుల సమక్షంలో...గోషామహల్, బేగంపేట్‌ ట్రాఫిక్‌ ఇన్‌స్టిట్యూట్లలో పోలీసులు కౌన్సిలింగ్‌ ఇవ్వనున్నారు. డ్రంక్ అండ్ ‌డ్రైవ్ కౌన్సిలింగ్‌కు యాంకర్ ప్రదీప్‌...తల్లిదండ్రులతో పాటు హాజరుకానున్నారు.

గతంలో ఓ లారీ డ్రైవర్‌ తాగి వాహనాన్ని నడిపాడు. బ్రీత్ ఎనలైజర్‌లో 170 శాతం నమోదు కావడంతో సదరు లారీ డ్రైవర్‌కు 5 రోజులు జైలు శిక్ష పడింది. ఈ నేపథ్యంలో న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా మందు కొట్టిన యాంకర్ ప్రదీప్‌ బ్రీత్‌ ఎనలైజర్‌లో 178శాతంగా మద్యం సేవించినట్టు నమోదైంది. దీంతో ప్రదీప్‌ కారును స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేశారు పోలీసులు. డ్రంక్ అండ్ డ్రైవ్‌ కేసుతో పాటు కారుకు బ్లాక్‌ ఫిల్మ్‌ తీసి వేయకపోవడంతో మరో కేసును నమోదు చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories