వైఎస్సార్ బయోపిక్‌లో అనసూయ.. ఏ పాత్రలోనంటే..

వైఎస్సార్ బయోపిక్‌లో అనసూయ.. ఏ పాత్రలోనంటే..
x
Highlights

మాజీ ముఖ్యమంత్రి దివంగత వైఎస్.రాజశేఖర్ రెడ్డి జీవిత కథ 'యాత్ర' పేరిట మహి వి. రాఘవ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. మమ్ముట్టి ప్రధాన పాత్ర...

మాజీ ముఖ్యమంత్రి దివంగత వైఎస్.రాజశేఖర్ రెడ్డి జీవిత కథ 'యాత్ర' పేరిట మహి వి. రాఘవ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. మమ్ముట్టి ప్రధాన పాత్ర పోషిస్తున్న ఈ చిత్రంలో యాంకర్ అనసూయ ఓ కీలక పాత్ర పోషిస్తున్నట్టు తాజా సమాచారం. రాజశేఖర రెడ్డి వర్గానికి చెందిన కర్నూలు రాజకీయ నాయకురాలి పాత్రను అనసూయ పోషిస్తున్నట్టు తెలుస్తోంది. రాజశేఖర్ రెడ్డి జీవితానికి సంబంధించిన ఏ ఒక్క ముఖ్య సన్నివేశాన్నీ మహి మిస్ చేయడం లేదట. చిన్న రోల్ కోసం అనసూయ లాంటి పాపులర్ ఫిగర్‌ని ఎంచుకుంటున్నారని తెలుస్తోంది. ఈ సినిమాలోని ప్రతి క్యారెక్టర్ గ్రాండ్‌గా కనిపించాలని.. ఈ సినిమా స్మాల్ బడ్జెట్ సినిమాలా అనిపించకూడదని మహి భావిస్తున్నట్టు సమాచారం.

Show Full Article
Print Article
Next Story
More Stories