అజ్ఞాత‌వాసి పాట‌కి అన‌సూయ డబ్ స్మాష్..

Submitted by arun on Sat, 12/23/2017 - 11:06
Anasuya Bharadwaj

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో పవన్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా రూపొందిన ‘అజ్ఞాతవాసి’ చిత్రం త్వరలో విడుదల కానున్న సంగతి తెలిసిందే. పవన్ సినిమా విడుదల కోసం అటు పవన్ అభిమానులతో పాటు అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రంలోని ఓ పాటకు బుల్లితెరపై యాంకర్‌గా పాపులరైన అందాల నటి అనసూయ డబ్ స్మాష్ చేసింది.‘బయటకొచ్చి చూస్తే.. టైమేమో 3’0 క్లాక్‌’ అనే పాటకు డబ్‌స్మాష్‌ చేసి సోష‌ల్ మీడియాలో షేర్ చేసింది. ఇందులో అన‌సూయ ఎక్స్‌ప్రెష‌న్స్ అభిమానుల‌ని ఎంత‌గానో ఆక‌ట్టుకుంటున్నాయి. ఈ వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ కూడా అయింది. అన‌సూయ ప్ర‌స్తుతం రంగ‌స్థలం చిత్రంలో ముఖ్య పాత్ర చేస్తున్న‌ట్టు తెలుస్తుంది. ఇక‌ హారిక హాసిని క్రియేషన్స్‌ బ్యానర్‌పై ఎస్‌.రాధాకృష్ణ నిర్మించిన అజ్ఞాత‌వాసి చిత్ర ట్రైల‌ర్ త్వ‌ర‌లోనే విడుద‌ల కానుంది.

English Title
anasuya dubsmash for Agnathavaasi song

MORE FROM AUTHOR

RELATED ARTICLES