చికాగో సెక్స్ రాకెట్ .. అనసూయ అప్పుడే ఛీకొట్టిందట

Submitted by arun on Mon, 06/18/2018 - 13:11
anasuya

చికాగో టాలీవుడ్ సెక్స్ ట్రాఫికింగ్ వ్యవహారాన్ని అమెరికా పోలీసులు నిగ్గుతేల్చడంతో ఇప్పుడు కిషన్ మోదుగుమూడి పాల్పడ్డ పాత అక్రమాలు వెలుగుచూస్తున్నాయి. మన సినీతారలు, యాంకర్లతో కిషన్ అలియాస్ శ్రీరాజ్ చెన్నుపాటి ఆయన భార్య చంద్రకళ చేసిన నీచాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ప్రొడక్షన్ మేనేజర్‌గా, సహనిర్మాతగా గతంలో పనిచేసిన కిషన్ తనకున్న పరిచయాలతో ఈవెంట్ల పేరిట సినీ తారలను అమెరికా రప్పించేవాడు. ఏడాది కాలంలో వీరు వర్దమాన తారల కోసం 76 విమాన టికెట్లు బుక్ చేశారంటే.. సెక్స్ దందా ఎలా సాగిందో అర్థం చేసుకోవచ్చు. వీరి బారిన పడిన తారల్లో ఐదుగురి పేర్లను ఫిర్యాదులో నమోదు చేశారని.. బెంగళూరు, చెన్నై నగరాలకు చెందిన ఇద్దరు ప్రముఖ నటీమణుల పేర్లు కూడా ఇందులో ఉన్నాయని టాలీవుడ్ వర్గాల సమాచారం. ఈ అమెరికా దంపతులు గతంలో తమను కూడా సంప్రదించారని యాంకర్‌ కమ్‌ నటి అనసూయలు ఓ ఆంగ్ల పత్రికకు తెలిపారు. 

ఈ ఉదంతంపై యాంకర్‌ అనసూయ భరద్వాజ్‌ స్పందిస్తూ.. ‘ 2016లో శ్రీరాజ్ తనను ఫోన్లో సంప్రదించాడని, సమావేశాలకు హాజరు కావాలని కోరుతూ, ‘కమిట్‌మెంట్’ ఇస్తారా అని అడిగాడని అనసూయ చెప్పారు. దీంతో ఆ ఈవెంట్‌కు హాజరుకానని చెప్పానని అనసూయ తెలిపారు. తాను రావడం లేదని చెప్పినా.. నా ఫొటోను పోస్టర్లో వేశారని దీంతో.. తాను ఆ ఈవెంట్‌కు వెళ్లడం లేదని ట్వీట్ చేశానని అనసూయ అప్పటి విషయాల్ని గుర్తుచేసుకున్నారు. 

English Title
anasuya comments on america tollywood sex rocket

MORE FROM AUTHOR

RELATED ARTICLES