క్లారిటీ ఇచ్చిన అనసూయ

Submitted by arun on Sat, 01/20/2018 - 12:22
Anasuya

తన అందంతో యువతను బుల్లి తెరకు కట్టిపడేసే అనసూయ..టీవీలోనే కాకుండా సోషల్ మీడియాలో కూడా యాక్టివ్‌గా ఉంటూ తన అభిమానులతో బోలెడన్ని విషయాలు పంచుకుంటోంది. మధ్య మధ్యలో చాట్ చేస్తూ నాటీ ఆన్సర్లతో స్వీట్ రిప్లైలు ఇస్తుంది. ఈ రోజు కూడా అనసూయ తన ట్వీటర్ అకౌంట్ ద్వారా అభిమానులతో చాటింగులో పాల్గొంది ఈ సందర్భంగా అభిమానులు అడిగిన ఆసక్తికర ప్రశ్నలకు టకటకా సమాధానాలు ఇచ్చేసింది. త్వరలో ఆమె ‘రంగస్థలం’ సినిమాతో మరోసారి వెండి తెరపై వెలగనున్న సంగతి తెలిసిందే. 

అయితే, అందులో రామ్‌చరణ్‌కు అత్తగా కనిపిస్తుందనే వార్త అభిమానులకు కాస్త కష్టంగానే అనిపిస్తోంది. అందుకే, ఆ డౌట్ ఇక్కడ తీర్చేసుకున్నారు.‘అనసూయ, నువ్వు రామ్ చరణ్‌కు అత్తగా నటిస్తున్నావా?’ అనే ప్రశ్నకు ఆమె బదులిస్తూ.. ‘‘అందులో నిజం లేదు. ఫాల్స్’’ అని సమాధానం ఇచ్చింది. అయితే అత్త పాత్రలో చేయటం లేదని చెప్పినా.. సినిమాలో తన పాత్ర ఏంటి అన్న విషయం మాత్రం వెల్లడించలేదు. అనసూయా.. అప్పుడే ఎందుకు పెళ్లి చేసేసుకున్నావ్ అనే ఓ అభిమాని ఆవేదనకు బదులిస్తూ... ‘‘హ హా.. ఈ ప్రశ్న నన్ను చాలామంది అడిగారు. ఈ ప్రశ్న ఎప్పుడు అడిగినా నేను ఇచ్చే సమాధానం ఒక్కటే. సమయం వచ్చినప్పుడు అన్నీ అలా జరిగిపోతాయంతే’’ అంటూ చమత్కారంగా చెప్పింది.

English Title
Anasuya chitchat with fans

MORE FROM AUTHOR

RELATED ARTICLES