బీజేపీ నేతలకు అమిత్ షా షాక్

Submitted by arun on Fri, 07/13/2018 - 17:05
Amit Shah

తెలంగాణలో పార్టీ బలోపేతమే లక్ష్యంగా హైదరాబాద్‌‌లో అడుగు పెట్టిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా వచ్చీ రావడంతోనే పార్టీ నేతలపై విరుచుకు పడ్డారు. నాంపల్లిలోని బీజేపీ కార్యాలయంలో పార్టీ విస్తారక్‌లతో భేటీ అయిన అమిత్‌ షా నేతలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బూత్ కమిటీలు ఇష్టం వచ్చినట్లు పని చేస్తున్నాయని మండిపడ్డారు. బీజేపీ జాతీయ పార్టీ బూత్ కమిటీలకు  23 గైడ్‌లైన్స్ ఇస్తే వాటిని 12కి కుదించడంపై సీరియస్ అయ్యారు. అంతేకాదు బూత్ కమిటీలు ఏర్పాటు చేయని చోట ఈ నెల చివరికి  ఏర్పాటు చేయాలని డెడ్ లైన్ పెట్టారు.

జిల్లాలో రాష్ట్ర బీజేపీ నేతలు పర్యటనలు తగ్గిపోయాయని కూడా అమిత్‌ షా తలంటారు. అంతేకాదు కేంద్రం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి ప్రచారం చేయడంతో తెలంగాణ బీజేపీ శాఖ విఫలమైందని సీరియస్ అయ్యారు. ప్రతి నియోజకవర్గంలోని పోలింగ్ బూత్‌లను abcd లుగా విభజించుకోవాలని విస్తారక్ భేటీలో సూచించిన అమిత్‌ షా. ప్రతి పోలింగ్ బూత్ లో ఐదుగురు స్మార్ట్ ఫోన్లు ఉన్న , ఐదుగురు బైకులు ఉణ్న కార్యకర్తలను గుర్తించాలని ఆదేశించారు. 

విస్తారక్‌లతో భేటీ తర్వాత అమిత్‌ షా అసెంబ్లీ , పార్లమెంటు స్థానాల ఇంఛార్జ్‌లు , ఎలక్షన్ మేనేజ్‌మెంట్ కమిటీలో సమావేశమయ్యారు. తెలంగాణ వ్యాప్తంగా బీజేపీ బలోపేతం, ఇతర పార్టీల నుంచి వలసల గురించి మంతనాలు జరుపుతారు. ఇవాల్టి టూర్‌లో అమిత్ షా పలువురు ప్రముఖులతో భేటీ అవుతారు. ప్రస్తుతం ఈనాడు సంస్థల అధినేత రామోజీరావును కలవడానికి వెళ్తున్నారు. తర్వాత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్‌తో భేటీ అవుతారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీకి మద్దతు ఇవ్వాలని రామోజీరావును,  సైనా నెహ్వాల్‌ను కోరే అవకాశం ఉంది.  

English Title
amithshah fires teleangana bjp leaders

MORE FROM AUTHOR

RELATED ARTICLES