డీఎస్ తనయుడితో భేటీ...డీఎస్ రాజకీయ భవిష్యత్తుపై చర్చ?

Submitted by arun on Tue, 07/17/2018 - 11:31

తెలంగాణలో ఒకరోజు పర్యటనలో బీజేపీ నేతలకు క్లాస్ పీకిన అమిత్ షా అసలెందుకొచ్చినట్లు? సీనియర్లను కాక కేవలం ఎంపిక చేసిన కొద్ది మందితో వ్యక్తిగత సమావేశాల వెనక ఎజెండా ఏంటి? హిందూత్వ ఎజెండా మోస్తున్న వారికే అమిత్ షా ప్రాధాన్యత ఇచ్చారా?

బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా తెలంగాణ ఒక్కరోజు పర్యటనపై ఆసక్తి కరమైన చర్చ జరుగుతోంది. ఎన్నడూ లేనిది అమిత్  షా సొంత పార్టీ నేతలతో వ్యక్తిగత భేటీలు కావడం వెనుక అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల పార్టీలో చేరిన డిఎస్  తనయుడు  ధర్మపురి అరవింద్ తో భేటి కావడంపై  పార్టీలో అందరు ఆస్తకిగా  చర్చించుకుంటున్నారు.  ఈమధ్యనే పార్టీలో చేరిన అరవింద్ కు రెడ్ కార్పెట్ వేయడం వెనుక ఆంతర్యం ఏమిటనే చర్చ కూడ జరుగుతోంది. అమిత్ షాతో  భేటిలో అరవింద్ తండ్రి, డీఎస్ రాజకీయ భవిష్యత్తుపై చర్చించారనే ప్రచారం కూడా పార్టీలో సాగుతోంది. డీఎస్ ను పార్టీలోకి తీసుకుంటే ఎలా ఉంటుందన్న అంశం చర్చించారన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

ఇక గోషామహల్ ఎమ్మెల్యే రాజసింగ్ తో అమిత్ షా అరగంట పాటు వ్యక్తిగతంగా భేటి కావడం పార్టీలో తీవ్ర చర్చలకు దారి తీసింది. పార్టీ సీనియర్ల ను బాహాటంగానే వ్యతిరేకించే రాజాసింగ్ ఈ భేటీలో వారిపై  ఫిర్యాదు చేశారనే అనుమానాలు పార్టీనేతల్లో కలుగుతున్నాయి. పార్టీ వ్యవహరాలు రాష్ట్ర పార్టీ నేతల తీరుపై పూర్తి సమాచారం తనకుందని రాజాసింగ్ ను సొంత ఎజెండాతో ముందుకెళ్లాలని సూచించినట్లు తెలుస్తోంది. పార్టీపై రాజాసింగ్ ప్రణాళికలను నేరుగ తనకే పంపాలని అమిత్ షా చెప్పినట్లు సమాచారం.  వచ్చే ఎన్నికల్లో తాను ప్రచారం చేయదలచుకున్న ప్రాంతాల లిస్టు తనకు ఇస్తే పూర్తి ఏర్పాట్లు చేస్తానని షా రాజసింగ్ కు హామి ఇచ్చారన్నది మరో కథనం.

తెలంగాణ బీజేపీలో రాజసింగ్ కరీంనగర్ బండిసంజయ్ , నిజామాబాద్ ధర్మపురి అరవింద్ లు మాత్రమే హిందు ఎజెండాతో బీజేపీలో పనిచేస్తున్న నాయకులు. వీరిలో ఇద్దరితో అమిత్ షా వ్యక్తిగతంగా భేటీ అవడం చూస్తుంటే  పార్టీలో వీరికి  ప్రాధాన్యత పెరుగుతోందనే చర్చ సాగుతోంది. స్వామి పరిపూర్ణనంద వివాదంలో అందరూ ఆయనకు అండగా ఉండి రాష్ట్ర ప్రభుత్వం పై పోరాటం చేయాలని షా సూచించినట్లు ప్రచారం జరుగుతోంది. కాబట్టి బీజేపీ వచ్చే ఎన్నికల్లో హిందూత్వ ఎజెండాతోనే బరిలోకి దిగుతుందన్న అంచనాలు కూడా వినిపిస్తున్నాయి. అమిత్ షా తన టూర్ లో పదిమందితో మాత్రమే వ్యక్తిగత సమావేశాలు జరిపారని వారిలో రాజాసింగ్, అరవింద్ ఉన్నారని మిగిలిన వారంతా వాణిజ్య వేత్తలేనని మరికొందరు విశ్లేషిస్తున్నారు. కాబట్టి షా సమావేశాలకు ప్రత్యేకత ఏమీ లేదని ఆ వర్గం వాదిస్తోంది.

English Title
Amit Shah Tour in Telangana

MORE FROM AUTHOR

RELATED ARTICLES