సీఎం చంద్రబాబుపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా ధ్వజం

Submitted by arun on Mon, 05/28/2018 - 12:02
babu

టీడీపీ,బీజేపీ మధ్య మాటల యుద్ధం మరింత ముదురుతోంది. రాజధాని అమరావతి నిర్మాణం కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు ఇంతవరకూ రూపాయి ఖర్చుపెట్టలేదని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా ఆరోపించారు. ఇప్పటికే 2,100 కోట్లు ఇచ్చామని, ఇచ్చినవాటికే లెక్కలు లేనప్పుడు కొత్తగా నిధులెలా ఇస్తామని ప్రశ్నించారు. తెలుగేతర రాష్ట్రాల్లో కేసీఆర్, చంద్రబాబుల ప్రభావం అంతగా ఉండదని అమిత్ షా తేల్చి చెప్పారు. 

టీడీపీతో కటీఫ్ అయిన తర్వాత ఏపీ పరిణామాలు, సీఎం చంద్రబాబు తీరుపై ఢిల్లీలో జరిగిన సమావేశంలో స్పందించారు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా. అమరావతి నిర్మాణం కోసం సీఎం చంద్రబాబు ఇంతవరకూ రూపాయి ఖర్చుపెట్టలేదని ఆరోపించారు. ఇప్పటికే .2,100 కోట్లు ఇచ్చామని, ఇచ్చినవాటికే లెక్కలు లేనప్పుడు కొత్తగా నిధులెలా ఇస్తామని ప్రశ్నించారు. గుజరాత్‌లో కేంద్రం సహకారంతో ఎలాంటి నగరాలూ నిర్మించడం లేదన్నారు. అక్కడ జరుగుతున్న అభివృద్ధి అంతా ఆ రాష్ట్ర సొంత ఖర్చుతోనే చేసుకుంటున్నారని చెప్పారు. 

ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, తెలంగాణ సీఎం కేసీఆర్ లు వారి రాష్ట్రాల్లో బలమైన నేతలు తప్పితే, వేరే రాష్ట్రాల్లో వారి ప్రభావం అంతగా ఉండదన్నారు అమిత్ షా. ఒడిశాలో చంద్రబాబు, పశ్చిమబెంగాల్‌లో కేసీఆర్ ప్రచారం చేస్తే ఎవరూ ఓట్లు వేయరని ఎద్దేవా చేశారు. కుమారస్వామి ప్రమాణస్వీకారం సందర్భంగా ప్రాంతీయపార్టీల నేతలంతా చేతులు కలిపినంత మాత్రాన బీజేపీకి వచ్చే నష్టమేమీ లేదని అమిత్‌షా ధీమా వ్యక్తం చేశారు. ఉత్తరప్రదేశ్‌లో ఎస్పీ, బీఎస్పీ అగ్రనేతలు కలిసినా కిందిస్థాయి కేడర్‌ అంత సులువుగా కలిసే అవకాశం ఉండదన్నారు. లోక్ సభ ముందస్తు ఎన్నికలకు వెళ్లే ప్రసక్తే లేదని అమిత్ షా స్పష్టం చేశారు. 

English Title
amit shah fire on chandrababu

MORE FROM AUTHOR

RELATED ARTICLES