షికాగో సెక్స్‌ రాకెట్‌: ఆడియో టేపుల కలకలం

Submitted by arun on Tue, 06/19/2018 - 13:43
sex

ఫిల్మ్ ఇండస్ట్రీలో.. షికాగో సెక్స్ రాకెట్ ప్రకంపనలు రేపుతోంది. ఇప్పటికే బయటికొచ్చిన కీలక సూత్రధారి కిషన్ ఆడియో టేపులు.. కలకలం రేపుతున్నాయి. ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్‌పై మహిళా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. టాలీవుడ్‌లో ఇంత జరుగుతున్నా.. ఇండస్ట్రీ పెద్దలు ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నిస్తున్నారు.

టాలీవుడ్‌లో క్యాస్టింగ్ కౌచ్ రేపిన కాక చల్లారక ముందే.. షికాగో సెక్స్ రాకెట్ దుమారం రేపుతోంది. ఈ వ్యవహారంపై మహిళా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. 4 నెలలుగా క్యాస్టింగ్ కౌచ్, షికాగో సెక్స్ రాకెట్‌పై తాము ప్రశ్నిస్తున్నా.. ఎవరూ పట్టించుకోవట్లేదని చెప్తున్నారు. సినీ ఇండస్ట్రీకి సంబంధించి 3 సార్లు సినిమాటోగ్రఫీ మంత్రి, ఇండస్ట్రీ పెద్దలు, FDCతో చర్చలు జరిపామన్నారు. క్యాష్ కమిటీ వేస్తామని చెప్పి.. ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. క్యాస్టింగ్ కౌచ్ వ్యవహారం తర్వాత.. కో ఆర్డినేషన్ వ్యవస్థను తీసేస్తామని.. ఆ దిశగా చర్యలు ప్రారంభించలేదని చెప్పారు. 

షికాగోకి వెళ్లిన వాళ్లంతా.. ఇష్ట పూర్వకంగానే వెళ్లారని చెప్తున్నారు. ఎఫ్ఐఆర్‌లో మాత్రం వారిని బెదిరించి తీసుకెళ్లారు.. వీళ్లంతా బాధితులను షికాగో పోలీసులు చెప్తున్నారని తెలిపారు. షికాగో బాధితుల పేర్లు, వివరాలు ఎవరు బయటపెట్టినా.. వారిపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.

అమ్మాయిలు విదేశాలకు వెళ్లి ఇలా చేయడం తప్పంటున్నారు సోషియాలిస్ట్‌లు. కానీ.. వాళ్లు ఎలాంటి పరిస్థితుల్లో వెళ్లారు.. ఎందుకు వెళ్లారని చర్చించే దమ్ము ఇండస్ట్రీకి ఉందా అని ప్రశ్నిస్తున్నారు. అమెరికాలో ఉన్న తానా లాంటి ఆర్గనైజేషన్‌లలో పారదర్శకత ఉండాలని చెప్తున్నారు. కో-డైరెక్టర్ కిషన్ దంపతులను ఎందుకు ఇండస్ట్రీ నుంచి సస్పెండ్ చేయడం లేదని అడుగుతున్నారు.

(adsbygoogle = window.adsbygoogle || []).push({});

Your browser does not support the audio element.

English Title
america sex racket kishan modugumudis audio tapes leaked

MORE FROM AUTHOR

RELATED ARTICLES