మళ్లీ రక్తమోడిన అమెరికా

Submitted by arun on Fri, 06/29/2018 - 11:03
America

అమెరికాలో మరోమారు తుపాకి గర్జించింది. మేరీల్యాండ్ రాష్ట్రంలోని ఓ పత్రికా కార్యాలయంలోకి ప్రవేశించిన దుండగుడు  విచక్షణ రహితంగా కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో నలుగురు మృతి చెందగా, పలువురు గాయపడినట్టు తెలుస్తోంది. నాలుగు అంతస్తుల ఈ భవనంపై ఓ గ్లాస్ డోర్ నుంచి దుండగుడు కాల్పులు జరిపాడు. ఈ అనూహ్య ఘటనతో అందులో పనిచేస్తున్న సిబ్బంది తీవ్ర భయాందోళనకు గురయ్యారు. పలువురు ఉద్యోగులు బల్లల కింద దాక్కుని ప్రాణాలు కాపాడుకున్నట్టు సమాచారం

కాల్పులు జరిపిన వ్యక్తి ఘటనా స్థలానికి సమీపంలోనే ఓ భవనంలో నక్కినట్టు పోలీసులు నిర్ధారించారు. హుటాహుటిన పత్రికా కార్యాలయం పరిసర ప్రాంతాలను ఖాళీచేసి విస్తృత తనిఖీలు చేపట్టారు. ఇప్పటికే ఓ అనుమానితుడిని అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. సహాయక చర్యలు చేపట్టేందుకు పలు మెడికల్ ఎమర్జెన్సీ బృందాలు ఘటనా స్థలానికి తరలివెళ్లాయి. కాగా దీనిపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రం‌ప్‌కు సమాచారం అందించామని వైట్‌హౌస్ వర్గాలు వెల్లడించాయి.

English Title
America firing

MORE FROM AUTHOR

RELATED ARTICLES