ప్రారంభమైన ఎల్బీనగర్‌-అమీర్‌పేట్‌ మెట్రోరైలు

ప్రారంభమైన ఎల్బీనగర్‌-అమీర్‌పేట్‌ మెట్రోరైలు
x
Highlights

అమీర్‌పేట్‌ నుంచి ఎల్‌బీనగర్‌ మెట్రో సేవలు ప్రారంభమయ్యాయి. గవర్నర్‌ నరసింహన్‌ పచ్చజెండా ఊపి మెట్రోను ప్రారంభించారు. కారిడార్‌ వన్‌ లో భాగంగా మియాపూర్‌...

అమీర్‌పేట్‌ నుంచి ఎల్‌బీనగర్‌ మెట్రో సేవలు ప్రారంభమయ్యాయి. గవర్నర్‌ నరసింహన్‌ పచ్చజెండా ఊపి మెట్రోను ప్రారంభించారు. కారిడార్‌ వన్‌ లో భాగంగా మియాపూర్‌ నుంచి ఎల్‌ బీ నగర్‌ వరకు మొత్తం 29 కిలోమీటర్ల మేర మెట్రో సేవలు పూర్తిగా అందుబాటులోకి వచ్చినట్లైంది. ఈ సాయంత్రం 6 గంటల నుంచి ప్రయాణీకులకు అందుబాటులోకి రానుంది. మంత్రులు, కేటీఆర్‌, నాయిని, తలసాని, ఇతర ప్రజా ప్రతినిధులు హాజరయ్యారు.

ఈ మార్గంతో ఢిల్లీ తర్వాత దేశంలోనే అతిపెద్ద మెట్రోగా భాగ్యనగర మెట్రో అవతరించింది. అత్యంత రద్దీగా ఉండే మియాపూర్‌ టు ఎల్‌ బీ నగర్‌ దారిలో మెట్రో సేవలు అందుబాటులోకి రావడంతో ట్రాఫిక్‌ కష్టాలు చాలావరకు తీరనున్నాయి. మెట్రోలో మియాపూర్‌ నుంచి ఎల్‌బీనగర్‌ వరకు కేవలం 50 నిముషాల్లోనే చేరుకోవచ్చు. 16 కిలోమీటర్ల దూరం ఉన్న ఈ మార్గంలో మొత్తం 17 స్టేషన్లున్నాయి. ఇక ఆసియాలో అతిపెద్ద ఇంటర్‌ ఛేంజ్‌ స్టేషన్‌గా ఎంజీబీఎస్‌ మెట్రో స్టేషన్‌ అవతరించింది.

Show Full Article
Print Article
Next Story
More Stories