ఐదు సీట్లలో కాంగ్రెస్ గెలుపుపై ధీమా...మరో మూడు చోట్ల టీఆర్‌ఎస్‌కు...

ఐదు సీట్లలో కాంగ్రెస్ గెలుపుపై ధీమా...మరో మూడు చోట్ల టీఆర్‌ఎస్‌కు...
x
Highlights

పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ సరళిపై తెలంగాణ కాంగ్రెస్ చర్చించింది. ఐదు సీట్లలో కాంగ్రెస్ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేసింది. మరో మూడు స్థానాల్లో గట్టి...

పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ సరళిపై తెలంగాణ కాంగ్రెస్ చర్చించింది. ఐదు సీట్లలో కాంగ్రెస్ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేసింది. మరో మూడు స్థానాల్లో గట్టి పోటీ ఇచ్చినట్లు అంచనా వేసింది. రానున్న మండల, జిల్లా పరిషత్ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ కు పోటీగా ఢీ కొట్టాలని నిర్ణయించింది.

తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ తర్వాత రానున్న మండల, జిల్లా పరిషత్ ఎన్నికలపై కాంగ్రెస్ దృష్టి సారించింది. అలాగే పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ సరళిపై చర్చించింది. గాంధీభవన్ లో నిర్వహించిన సమావేశంలో పార్టీ రాష్ట్ర ఇంచార్జ్ కుంతియా, టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ తో పాటు సీనియర్ నాయకులు హాజరయ్యారు.

పార్లమెంట్ సీట్లలో పార్టీ గెలుపు, ఓటములపై కాంగ్రెస్ నాయకులు విశ్లేషణ చేశారు. భువనగిరి ,చేవెళ్ల, నల్గొండ , మల్కాజ్ గిరి , ఖమ్మంల్లో కాంగ్రెస్ విజయం సాధిస్తుందని, జహీరాబాద్ ,పెద్దపల్లి , ఆదిలాబాద్ లో గట్టి పోటీ ఇచ్చిందని అభిప్రాయపడ్డారు.

రానున్న ఎంపీటీసీ,జెట్పీటీసీ ఎన్నికల అభ్యర్థుల ఎంపిక బాధ్యతలను మండల కాంగ్రెస్ అధ్యక్షులకు, నియోజక వర్గ ఇంఛార్జీలకు అప్పగించాలని పీసీసీ నిర్ణయించింది. ఈ ఎన్నికలను గ్రామ, మండల, జిల్లా నాయకులు ప్రతిష్టాత్మకంగా తీసుకొని పని చేయాలని కోరింది. ఈ నెల 15వ తేదీ లోగా మండల అధ్యక్షులు అభ్యర్థుల జాబితాలను సిద్ధం చేయాలని ఆదేశించింది. జిల్లా పరిషత్ చైర్మన్ అభ్యర్థుల ఎంపిక విషయాన్ని పీసీసీయే నిర్ణయించాలని ఈ సమావేశంలో నిర్ణయించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories