నా మొదటి ప్రేమికుడెవరో తెలుసా?

Submitted by arun on Sat, 06/23/2018 - 12:46
Amala Paul

కెరీర్ ఉన్నత స్థాయిలో ఉన్నప్పుడే తమిళ దర్శకుడు విజయ్ తో ప్రేమలో ముగినితేలి, ఆ తర్వాత ఆయనను నటి అమలాపాల్ పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే, మనస్పర్థల నేపథ్యంలో, అతని నుంచి అంతే వేగంగా ఆమె విడిపోయింది. ప్రస్తుతం సినిమాలతోనే ఆమె బిజీగా ఉంది. తాజాగా ప్రేమ గురించ ఆమె మాట్లాడుతూ, ఇటీవల ఒక కార్యక్రమంలో అమలాపాల్‌ పేర్కొంటూ తనకు తొలిప్రేమ కథ ఉందని సంచలన వ్యాఖ్యలు చేసింది. తన మొదటి ప్రేమ అనుభవం గురించి మాట్లాడుతూ తానిప్పుడు నచ్చిన చిత్రాలను ఎంచుకుని నటిస్తున్నానని చెప్పింది. వ్యక్తిగత విషయానికి వస్తే ఇప్పుడు చాలా మందికి మొదటి ప్రేమ ఉంటుందని అలా తనకు తొలిప్రేమ కథ ఉందని చెప్పింది.తన మొదటి ప్రేమికుడు ఎవరో కాదని, నటుడు మాధవన్‌ అని చెప్పింది. మాధవన్‌ అంటే తనకు చిన్నతనం నుంచి చాలా ఇష్టం అని పేర్కొంది. తన తొలి ప్రేమికుడు ఆయనేనని చెప్పింది. ఈ విషయాన్ని చెప్పినప్పుడు నటుడు మాధవన్‌ ఆమె పక్కనే ఉన్నారు. అమలాపాల్‌ చెబుతుంటే మాధవన్‌ చిరునవ్వులు చిందిస్తూ ఉండిపోయారు. అమలాపాల్‌ మాత్రం లేచివెళ్లి ఆయన్ని హగ్‌ చేసుకుంది.

English Title
Amala Paul Hugged Her Childhood Crush...

MORE FROM AUTHOR

RELATED ARTICLES