ఆనాటి మహ చిత్రం..అల్లూరి సీతారామరాజు

ఆనాటి మహ చిత్రం..అల్లూరి సీతారామరాజు
x
Highlights

సూపర్ స్టార్ మహేష్ బాబు తండ్రిగారు.. ఘట్టమనేని కృష్ణ కథానాయకునిగా 1974లో విడుదలైన తెలుగు సినిమా. భారత దేశ ప్రఖ్యాత స్వాతంత్ర్య సమరయోధుడు, గిరిజన...

సూపర్ స్టార్ మహేష్ బాబు తండ్రిగారు.. ఘట్టమనేని కృష్ణ కథానాయకునిగా 1974లో విడుదలైన తెలుగు సినిమా. భారత దేశ ప్రఖ్యాత స్వాతంత్ర్య సమరయోధుడు, గిరిజన విప్లవ నాయకుడు అల్లూరి సీతారామరాజు జీవితాన్ని ఆధారం చేసుకుని నిర్మించిన బయోపిక్. ఈ సినిమాలో కృష్ణ, విజయనిర్మల, కొంగర జగ్గయ్య ప్రధాన పాత్రల్లో నటించగా, ఘట్టమనేని హనుమంతరావు, ఘట్టమనేని ఆదిశేషగిరిరావు నిర్మించారు. సినిమాలో కొంతభాగానికి వి.రామచంద్రరావు దర్శకత్వం వహించి మరణించగా, మగిలిన చిత్రానికి కృష్ణ, పోరాట సన్నివేశాలకు కె.ఎస్.ఆర్.దాస్ దర్శకత్వంలో పూర్తిచేశారు. అల్లూరి సీతారామరాజు జీవితాన్ని ఆధారం చేసుకుని సినిమా నిర్మించేందుకు నందమూరి తారక రామారావు స్క్రిప్ట్ రాయించుకుని ప్రయత్నాలు చేసినా ఫలించలేదు. అక్కినేని నాగేశ్వరరావు, శోభన్ బాబు అల్లూరి పాత్రలో సినిమా తీయాలని కూడా విఫల యత్నాలు జరిగాయి. ఈ నేపథ్యంలో అల్లూరి జీవితాన్ని ఆధారం చేసుకుని స్క్రిప్టును త్రిపురనేని మహారథితో రాయించుకుని కృష్ణ తెరకెక్కించారు. అలా సూపర్ స్టార్ కృష్ణ గారు మరొక సారి తన సాహసవంతమైన వ్యక్తిత్వాన్ని ప్రదర్శించారు. శ్రీ.కో.

Show Full Article
Print Article
Next Story
More Stories