భార్య అందంపై బన్నీ పోస్ట్‌.. వైరల్‌

Submitted by arun on Wed, 07/25/2018 - 15:29
 Allu ArjunSneha Reddy

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారనే సంగ‌తి తెలిసిందే. అప్పుడప్పుడు త‌న ఫ్యామిలీకి సంబంధించిన ఫోటోలు, పిల్ల‌ల‌తో దిగిన ఫోటోల‌ని సామాజిక మాధ్యమాల‌లో షేర్ చేస్తూ అభిమానుల‌కి ఆనందాన్ని పంచుతాడు. తాజాగా బ‌న్నీ ఫ్యామిలీకి సంబంధించిన ఫోటోలు సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి. బన్నీ భార్య స్నేహ తన ఇద్దరు పిల్లలు అయాన్, అర్హలతో ఉన్న పిక్‌తో పాటు స్నేహ సింగిల్ ఫోటో , అర్హ సోలో ఫోటోలు అభిమానుల‌ని ఆక‌ట్టుకుంటున్నాయి. ఇక త‌న భార్య సోలో ఫోటోని ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ.. ఓ మై గాడ్ ! నేను న‌మ్మ‌లేక‌పోతున్నాను. ఇంత అంద‌మైన అమ్మాయిని వివాహం చేసుకున్నానా అంటూ కామెంట్ పెట్టాడు అల్లు అర్జున్. త‌న భార్య ధ‌రించిన స‌ల్వార్ క‌మీజ్ డ్రెస్‌ని స్టైలిస్ట్ హ‌ర్మ‌న్ కౌర్ అందంగా త‌యారు చేశార‌ని కూడా తెలిపాడు. ఈ ఫోటోను బ‌న్నీ పోస్ట్ చేసిన కొద్ది స‌మ‌యానికే రెండు లక్ష‌ల లైక్‌లు వ‌చ్చాయి.

allu family pics goes viral

English Title
allu arjun on wife sneha reddy cant believe i married such a pretty woman

MORE FROM AUTHOR

RELATED ARTICLES