పవన్‌కు మద్దతు తెలిపేందుకు ఫిలించాంబర్‌కు అల్లు అర్జున్!

Submitted by arun on Fri, 04/20/2018 - 12:32
pk

'చెప్పను బ్రదర్' అంటూ గతంలో ఓ ఫంక్షన్ లో అల్లు అర్జున్ చేసిన వ్యాఖ్యలు మెగా ఫ్యాన్స్ లో కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఏ సందర్భంలో కూడా పవన్ కల్యాణ్, అల్లు అర్జున్ లు కలవలేదు. ఏ ఫంక్షన్ లోనూ ఇద్దరూ కలసి కనిపించలేదు. ఈరోజు వీరిద్దరినీ మళ్లీ కలిపింది. పవన్ కల్యాణ్, నాగబాబు చాంబర్‌కు చేరుకున్న సమయంలోనే అల్లుఅర్జున్ కూడా రావడంతో మెగా ఫ్యామిలీకి మద్దతుగా బన్నీ వచ్చి ఉండొచ్చని భావిస్తున్నారు. అయితే ఫిలించాంబర్‌లోని ఓ హాల్‌లో నాగబాబు, పవన్ కల్యాణ్ కలిసి న్యాయవాదులతో చర్చిస్తుంటే.. అల్లు అర్జున్ మాత్రం బయటే ఉన్నట్లు తెలిసింది. అయితే అల్లు అర్జున్ చాంబర్‌కు వచ్చిన సమయంలో పవన్‌ బన్నీని ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు. మెగా ఫ్యామిలీ పరువుప్రతిష్టలకు సంబంధించిన విషయం కావడంతో అల్లు కుటుంబం కూడా కలిసి నడవాలని నిర్ణయించింది. ఇదిలా ఉంటే, అల్లు అరవింద్ కూడా పవన్‌ తల్లిని శ్రీరెడ్డి దూషించిన వివాదంపై గురువారం ప్రెస్‌మీట్ నిర్వహించిన సంగతి తెలిసిందే.

English Title
allu arjun support pawan kalyan

MORE FROM AUTHOR

RELATED ARTICLES