పవర్‌స్టార్‌ను బన్నీ అంత మాటన్నారా? ఎందుకు?

Submitted by arun on Thu, 06/07/2018 - 12:23
pawan

కెరీర్‌లో ఎద‌గ‌డానికి బ‌న్నీకి త‌నవంతు సపోర్ట్ అందించాడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ . అయితే కొన్నాళ్ళ క్రితం ఓ ఆడియో వేడుక‌లో ప‌వన్ గురించి మాట్లాడ‌మని అభిమానులు గోల చేయ‌గా, అప్పుడు నేను చెప్ప‌ను బ్ర‌ద‌ర్ అంటూ మాట దాటేశాడు బ‌న్నీ . దీంతో అల్లు అర్జున్‌కి, ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కి మ‌ధ్య వైరం ఉందంటూ జోరుగా ప్ర‌చారం జ‌రిగింది. ఈ క్ర‌మంలో ఇటీవల ఫిలిం ఛాంబ‌ర్‌లో దీక్ష‌కి దిగిన ప‌వన్‌కి మ‌ద్ద‌తు తెలుపుతూ బ‌న్నీ అక్క‌డికి రావ‌డంతో పాటు ఆయ‌న‌ని ఆత్మీయంగా ఆలింగ‌నం చేసుకున్నాడు. దీంతో రూమ‌ర్స్‌కి బ్రేక్ ప‌డింది.

ఇటీవల జరిగిన ‘నా పేరు సూర్య’ ప్రీ రిలీజ్ వేడుకకు పవన్ రావడం, పవన్ కు ఎన్నికల్లో తాను సపోర్ట్ చేస్తానని బన్నీ అనడంతో ఇప్పుడు ఇరు హీరోల అభిమానులు క‌లివిడిగా ఉంటున్నారు. అయితే తాజాగా బన్నీ పవన్‌ను ఉద్దేశించి సోషల్‌మీడియాలో ఓ పోస్ట్‌ పెట్టారు. రాజకీయంగా పవన్‌ ఎదుర్కొంటున్న విమర్శల్ని గురించి తన కామెంట్‌ ద్వారా వ్యక్త పరిచారు. ‘నువు​ నీ పిచ్చితో ఉంటే... ప్రపంచమే సర్దుకుపోతుంది’ అంటూ పవన్‌ ఫోటోను షేర్‌ చేశారు. ఇంత మంది మెగా హీరోలు ఉన్నా కూడా ఒం‍టరిగానే నిలబడ్డారు పవన్‌ కల్యాణ్‌. ఏ ఒక్కరి సహాయాన్ని పవన్‌ కోరడం లేదు. సమయం వచ్చినప్పుడల్లా మెగా హీరోలే స్పందించి మేము ఎప్పుడైనా పవన్‌ వెంట నడవడానికి సిద్ధమే అంటూ చెప్పుకొస్తున్నారు. 

English Title
allu arjun shares pawan photo

MORE FROM AUTHOR

RELATED ARTICLES