పైరసీ కోరల్లో భారీ చిత్రం : అల్లు అరవింద్‌

Submitted by arun on Tue, 08/14/2018 - 11:35
allu aravind

ఏయూలోని కాన్వొకేషన్‌ హాల్‌లో ఆదివారం గీత గోవిందం ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌ను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అల్లు అరవింద్‌ మాట్లాడుతూ తమ బ్యానర్‌లో దర్శకుడు పరుశరాం రెండు సినిమాలు చేశారని, మూడో సినిమా కూడా చేయబోతున్నట్టు వెల్లడించారు. గీత గోవిందం సినిమాకు సంబంధించిన కొన్ని సీన్లు లీకైయ్యాయని, అందుకు కారణమైన 17 మంది విద్యార్థులు అరెస్టు అయ్యారని చెప్పారు. అయితే ఈ విషయంపై గీత గోవిందం ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో మాట్లాడిన నిర్మాత అల్లు అరవింద్‌ మరో షాక్‌ ఇచ్చారు. గీత గోవిందం తో పాటు మరో మూడు సినిమాలు కూడా పైరసీ బారిన పడినట్టుగా వెల్లడించారు అరవింద్. అంతేకాదు వీటిలో ఓ భారీ చిత్రం కూడా ఉందని, ఆ సినిమాల గురించి ఆలోచిస్తే బాధ అనిపిస్తుందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో ఆ భారీ చిత్రం ఏదన్న చర్చ పెద్ద ఎత్తున జరుగుతోంది. అయితే ఇప్పటికే లీకేజ్‌కి కారణమైన వ్యక్తులు పట్టుబడటంతో ఆ సినిమాలు ప్రమాదం నుంచి బయట పడినట్టే అన్న వాదన వినిపిస్తోంది.
 

English Title
allu aravind hints about upcoming movie leaks

MORE FROM AUTHOR

RELATED ARTICLES