అచ్ఛేదిన్‌ కబ్‌ ఆయేగ మోడీ జీ! జనం నెత్తిన పెట్రో బాంబ్‌

Submitted by santosh on Mon, 09/10/2018 - 12:06
alltime petrol hike

మోటర్‌ సైకిల్‌ ఇంట్లో నుంచి బయటకు తియ్యాలంటేనే వాహనదారులు భయపడుతున్నారు. మూలకేసిన సైకిల్‌ దుమ్ము దులిపి, బయటకు తీద్దామనుకుంటున్నారు. షెడ్డూలోనే కార్లు పెట్టి, కొందరు బస్సెక్కుతుంటే, మరొకొందరు గుర్రాలెక్కుతున్నారు. బైక్‌ రిజర్వ్‌లో పడగానే, బంకువైపు వెళదామంటేనే జంకుతున్నారు. ఇంతకీ ఏమైంది పెట్రోల్‌కు అనుకుంటున్నారా....రేట్లతో మంటపెడుతోంది...ఐదొందల పోయిస్తే ఆరేడు లీటర్లు వచ్చే పెట్రోల్, ఇప్పుడు ఐదు లీటర్లు పడిపోయింది....జేబుకు చిల్లు పడుతోంది. అటు రూపాయి కూడా పతనమవుతూ, కంప్యూటర్లు, ఫోన్లు, ఇతర బ్రాండెడ్‌ రేట్లను బాదేస్తోంది. ఇంతకీ రూపీ ఎందుకు డౌన్‌ఫాల్ అవుతోంది...పెట్రో, డీజిల్‌ మంటలు చల్లారేదెప్పుడు.

ఐపీఎల్‌లో మన స్టేట్‌ కుర్రాడు సెంచరీ కొట్టగానే గెంతులేశాం. పెట్రో మీటర్‌లో లీటర్‌ ధర సెంచరీ కొడుతుందేమోనని, భయపడుతున్నాం. హైదరాబాద్‌లో 83 రూపాయలకి పైగా పలుకుతున్న, లీటర్‌ పెట్రోల్, వందతో బాదేయడం ఖాయమన్న సిగ్నల్స్‌ వణుకుపుట్టిస్తున్నాయి. అచ్చేదిన్ ఆయేగా అంటూ కేకలేసిన మోడీ, పెట్రోల్, డీజిల్‌ రేట్లను పెంచుతూ, చచ్చేదిన్‌ అనేలా వ్యవహరిస్తున్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. అటు రూపీ, ఇటు ఆయిల్ రేట్లు, లైఫ్‌ టైం హైకి ఎగబాకుతూ సామాన్యుల గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తున్నాయి. 

రూపాయి పతనం, చమురు దేశాల సంక్షోభమే, పెట్రో, డీజిల్‌ రేట్ల పెరుగుదలకు కారణమని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సన్నాయి నొక్కులు నొక్కుతున్నాయి. కానీ ఆయిల్ రేట్లలో వారి వడ్డింపులే సగానికి సగమన్న విషయాన్ని దాటవేస్తున్నాయి. ట్యాక్స్‌లు తగ్గించాలని డిమాండ్‌ చేస్తూ, కేంద్ర, రాష్ట్రాలు ఒకదానిపై ఒకటి దుమ్మెత్తిపోసుకుంటున్నాయి. పెట్రోల్, డీజిల్‌ రేట్లు పెరిగితే కేవలం వాహనదారులపైనే భారం పడదు. మొత్తం రవాణా చార్జీలు పెరుగుతాయి. పాలు, కూరగాయలు, వంట సామాగ్రితో పాటు అనేక నిత్యావసరాల రేట్లకు రెక్కలొస్తాయి. వాటి భారం మొత్తం, తిరిగి జనాలపై మోపేస్తాయి కంపెనీలు. దీంతో అన్ని రకాలుగా సామాన్యుల జేబులకు చిల్లులు పడుతున్నాయి.

English Title
alltime petrol hike

MORE FROM AUTHOR

RELATED ARTICLES